Actor Satyadev : ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసిన హీరో సత్యదేవ్.. సోషల్ మీడియాలో వైరల్

|

Feb 10, 2021 | 2:33 AM

2011లో వచ్చిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సత్యదేవ్.. 2015లో విడుదలైన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడి..

Actor Satyadev : ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసిన హీరో సత్యదేవ్.. సోషల్ మీడియాలో వైరల్
Follow us on

2011లో వచ్చిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సత్యదేవ్.. 2015లో విడుదలైన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ సత్తా చాటుతున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

తాజాగా తన కొడుకు ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసాడు సత్యదేవ్.. ఇన్ని రోజులు సత్యదేవ్ ఫ్యామిలీ ఫోటోలు ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఇలా సడన్ గా తన భార్య కొడుకుతో ఉన్న ఫోటోని సత్యదేవ్ షేర్ చేయడంతో ఈ ఫో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సత్య దేవ్ సినిమాల విషయానికొస్తే ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ డ్రామాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. అతడి సరసన  తమన్న హీరోయిన్‌గా  చేస్తుంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్ ‘తిమ్మరుసు’లోనూ సత్యదేవ్ హీరోగా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas- Nag Ashwin movie: ప్రభాస్ సినిమా కథకు నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చాడా..అదే కథతో మూవీ రాబోతోందా..?