AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో 1000 కోట్ల సినిమా హీరోయిన్.. ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..

మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్ల మేర కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే చిరు తర్వాతి సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో 1000 కోట్ల సినిమా హీరోయిన్.. ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..
Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 04, 2026 | 7:40 PM

Share

ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 12న విడుదలైన ఈ మెగా మూవీ ఏకంగా రూ.400 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. తద్వారా రీజినల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డుల కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన తర్వాతి ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించారు మెగాస్టార్. ముందుగా ‘విశ్వంభర’ సినిమాను పూర్తి చేయనున్నారు చిరంజీవి. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ ఈ ఏదాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక విశ్వంభర తర్వాత మరోసారి బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నారు చిరంజీవి. గతేడాదే ఈ ప్రాజెక్టుపైఅధికారిక ప్రకటన వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మెగా మూవీ నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మెగా 158 ‘వర్కింగ్ టైటిల్)’ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే..

ఈ మెగా సినిమాలో హీరోయిన్ గా ప్రియమణిని తీసుకున్నారట. అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇదే ప్రాజెక్టులో మెగాస్టార్ చిరంజీవి కూతురిగా లేటేస్ట్ సెన్సేషన్ సారా అర్జున్ నటించనుందని సమాచారం. సారా ఎంపికకు సంబంధించి దర్శక నిర్మాతలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

సారా అర్జున్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjunn)

కాగా ఛైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. విక్రమ్ నాన్న, పొన్నియన్ సెల్వన్ తదితర సినిమాల్లో సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ధురంధర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీ లో మాత్రమే రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 1300 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఇక ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే యుఫోరియా సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించనున్న సారా ఇప్పుడు ఏకంగా చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసింది.

View this post on Instagram

A post shared by Sara Arjun (@saraarjunn)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది?
గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది?
2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ..
2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ..
డగౌట్‌లో గంభీర్ అసలెందుకు నవ్వడు.. అసలు రీజన్ ఇదే..?
డగౌట్‌లో గంభీర్ అసలెందుకు నవ్వడు.. అసలు రీజన్ ఇదే..?
వలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ..
వలం రూ.49,999లకే TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్‌ 86 కి.మీ..
7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట
7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట
సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా
సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా
జాబ్ అలర్ట్.. పోలీసు శాఖలో 17,992 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు
జాబ్ అలర్ట్.. పోలీసు శాఖలో 17,992 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు
ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు
ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!
ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌..!
బాయ్ కాట్ SRH అంటూ కావ్యపాపకు షాకిచ్చిన ఫ్యాన్స్
బాయ్ కాట్ SRH అంటూ కావ్యపాపకు షాకిచ్చిన ఫ్యాన్స్