Sankranthi Movies: సంక్రాంతి పందెం కోళ్లు.. అన్ని పెద్ద సినిమాలే.. ఈసారి గెలిచేది ఎవరో..

పండగ సీజన్‏లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ వచ్చేస్తుంది. అయితే ఈసారి మాత్రం స్టార్ హీరోస్ మధ్య పెద్ద పోటీ ఉండబోతుంది. మొత్తం ఐదు సినిమాలు ఈసారి పండక్కి బరిలో నిలిచాయి. కొద్ది రోజులుగా ఈ ఐదు సినిమాల విడుదల విషయంలోనే ఇండస్ట్రీ పెద్దలు చర్చిస్తున్నాయి. అన్ని సినిమాలు ఓకేసారి విడుదల కావాలంటే థియేటర్ల విషయంలో ఇబ్బందులు తప్పవని మాట్లాడుకున్నారు. అన్ని సినిమాల దర్శకనిర్మాతలు కలిసి మాట్లాడుకున్నారు. ఈ పండక్కి ఎవరో ఒకరు వెనకడుగు వేయాలని..

Sankranthi Movies: సంక్రాంతి పందెం కోళ్లు.. అన్ని పెద్ద సినిమాలే.. ఈసారి గెలిచేది ఎవరో..
Sankranthi Movies

Updated on: Jan 05, 2024 | 10:46 AM

పండగ సీజన్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే దర్శకనిర్మాతలకు కలిసొచ్చే పండగా. తెలుగు సినీపరిశ్రమలో ఈ పండక్కి బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతరే. చిన్న సినిమాల దగర్నుంచి పెద్ద స్టార్ హీరోల చిత్రాల వరకు జనాలను అలరించేందుకు పోటీపడుతుంటారు. ఒకటి కాదు రెండు కాదు.. వరుస పెట్టి చిత్రాలు ఈరోజున విడుదలవుతుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు స్టార్ హీరోల చిత్రాలు బరిలో నిలుస్తాయి. పండక్కి బంధువులతో సరదాగా ఉండే ఫ్యామిలీస్ చూడదగిన సినిమాలనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. పండగ సీజన్‏లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ వచ్చేస్తుంది. అయితే ఈసారి మాత్రం స్టార్ హీరోస్ మధ్య పెద్ద పోటీ ఉండబోతుంది. మొత్తం ఐదు సినిమాలు ఈసారి పండక్కి బరిలో నిలిచాయి. కొద్ది రోజులుగా ఈ ఐదు సినిమాల విడుదల విషయంలోనే ఇండస్ట్రీ పెద్దలు చర్చిస్తున్నాయి. అన్ని సినిమాలు ఓకేసారి విడుదల కావాలంటే థియేటర్ల విషయంలో ఇబ్బందులు తప్పవని మాట్లాడుకున్నారు. అన్ని సినిమాల దర్శకనిర్మాతలు కలిసి మాట్లాడుకున్నారు. ఈ పండక్కి ఎవరో ఒకరు వెనకడుగు వేయాలని.. వారికి ఆ తర్వాత ఫుల్ థియేటర్స్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఏ సినిమా వాయిదా పడింది అనేది మాత్రం స్పష్టత రాలేదు.

ఇక గురువారం మరోసారి దర్శకనిర్మాతలు.. సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రయూనిట్లతో చర్చలు జరిపారు. నిన్న సాయంత్రమే తెలుగు సినిమా నిర్మాతల మండలి ప్రెస్ మీట్ జరగ్గా.. సంక్రాంతి సినిమాల విడుదలపై క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి పండగ కానుకగా ప్రజల ముందుకు రాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

సంక్రాంతి సినిమాలు..
1. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.

2. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్. ఈ మూవీ జనవరి 13న అడియన్స్ ముందుకు రాబోతుంది.

3. ఇవే కాకుండా.. చాలా కాలం గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా సైంధవ్. ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంంది.

4. అలాగే ఘోస్ట్ సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న నాగార్జున ఇప్పుడు నా సామిరంగ అంటూ రాబోతున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.

ఈసారి పండక్కి మొత్తం నాలుగు సినిమాలో బరిలో నిలిచాయి. అందులోనూ అన్ని చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఏ హీరో సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది ? ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది..? ఈసారి సంక్రాంతి బరిలో గెలిచేది ఎవరో? చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.