Rajeev Rayala |
Feb 26, 2022 | 3:07 PM
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన భామల్లో సంయుక్త మీనన్ ఒకరు
ఆమె తొలిచిత్రంగా 'భీమ్లా నాయక్' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సుందరి 2016లోనే మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.
'కలరి' అనే సినిమాతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. 'గాలిపట 2' సినిమాతో త్వరలో కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది.
. ఇక సంయుక్త తెలుగులో వరుస అవకాశాలు అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పలువురు.
సంయుక్త తెలుగు బాగానే మాట్లాడుతోంది. పైగా చాలా కఠినమైన పదాలను కూడా స్పష్టంగా పలుకుతోంది. అందువలన తెలుగులో అవకాశాలు బాగానే రావొచ్చు అని అంటున్నారు కొందరు.