
ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అంతేకాదు.. అప్పటి నుంచి మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. కొద్ది నెలలుగా సామ్ విదేశాల్లో రెస్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అప్డేట్స్ కాకుండా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సామ్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ వెంటనే తిరిగి వెళ్లిపోయినట్లు టాక్ వినిపించింది. అయితే ఉన్నట్లుండి సామ్ ముంబయిలోని ఓ ప్రముఖ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో సామ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ గ్రే బాడీకాన్ క్రాప్ టాప్ తోపాటు.. డెనిమ్ జీన్స్ ధరించి సరికొత్త ఫ్యాషన్ ఐకానిక్ గా కనిపించింది. సామ్ సరికొత్త లుక్ చూస్తుంటే.. హాలీవుడ్ తారగా కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇందులో సచిన్ ఖేద్కర్, జయరామ్, మురళీ శర్మ, రష్మీ, రోహిణి, శరణ్య పొన్వన్నన్ కీలకపాత్రలు పోషించారు. 2022లో హృదయం సినిమాతో పాపులర్ అయిన హేశమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఇదిలా ఉంటే.. సమంత నటించిన సిటాడెల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. స్పై థ్రిల్లర్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తర్వాత సామ్ నటించిన రెండో బాలీవుడ్ చిత్రం ఇది. ఇందులో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. అవెంజర్స్ ఫ్రాంచైజీకి పేరుగాంచిన రస్సో బ్రదర్స్ సిటాడెల్ తెరకెక్కించారు. అమెరికన్ వెర్షన్‌లో రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.