Samantha: పెళ్లి డ్రెస్‏కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. వెడ్డింగ్ గౌను రీమోడల్.. ఇకపై ఇలాగే..

|

Apr 26, 2024 | 10:48 AM

కారణాలు తెలియవు కానీ తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు షాకిచ్చిన టాలీవుడ్ జోడీ సమంత, నాగచైతన్య. వీరిద్దరు 2021లో డివోర్స్ తీసుకున్నామంటూ ప్రకటించారు. వీరు విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న ఇద్దరి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతూకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పటికే చెరిపేసింది సామ్. ఇన్ స్టాలో ఫోటోస్ డెలీట్ చేయడం.. టాటూ తొలగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లినాటి గుర్తులను మార్చేసింది.

Samantha: పెళ్లి డ్రెస్‏కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. వెడ్డింగ్ గౌను రీమోడల్.. ఇకపై ఇలాగే..
Samantha
Follow us on

మనసులు కలిసి ముడిపడిన బంధాలు కొన్నాళ్లకు మనస్పర్థల కారణంగానే విడిపోతున్నాయి. ఇప్పుడు సినీ పరిశ్రమలో అదే పరిస్థితి ఏర్పడింది. కొద్ది నెలలుగా ఇండస్ట్రీలో డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో సమంత, చైతు విడాకుల ప్రకటన ఒకటి. కారణాలు తెలియవు కానీ తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు షాకిచ్చిన టాలీవుడ్ జోడీ సమంత, నాగచైతన్య. వీరిద్దరు 2021లో డివోర్స్ తీసుకున్నామంటూ ప్రకటించారు. వీరు విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న ఇద్దరి గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతూకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పటికే చెరిపేసింది సామ్. ఇన్ స్టాలో ఫోటోస్ డెలీట్ చేయడం.. టాటూ తొలగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లినాటి గుర్తులను మార్చేసింది.

2017లో క్రిస్ట్రియన్ , హిందూ సంప్రదాయాల ప్రకారం చైతూ, సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. అయితే సామ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో సామ్ ధరించిన తెల్లటి గౌనును మార్చేసి నల్లటి మోడ్రన్ డ్రెస్ గా మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది.”ఇకపై నేను ధృడంగా ఉండడం మర్చిపోలేము. నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చిన క్రేశాబజాజ్ కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసినవారికి ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది.

విడాకుల తర్వాత సామ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చాలా కాలంగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆమె కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.