
సమంత (Samantha) ఇప్పుడు చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు.. యాడ్స్.. వ్యాపారాల్లోనూ రాణిస్తోంది. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు సిద్ధమైంది సామ్. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “యశోద’లో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం” అని చెప్పారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Also Read: Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‌పుల్ యాక్షన్‌తో అదరగొట్టిన విజయ్ దళపతి..
Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..