
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన స్నేహితులతో కలిసి వేకేషన్ లో ఉంది.

ఇటీవలే బాలి ట్రిపు ముగించుకుని ఇండియాకు వచ్చింది సామ్. మరోవైపు సమంతకు అరుదైన గౌరవం దక్కింది.

న్యూయార్క్ లో జరగనన్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది.

వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో పాల్గొనాలని సమంతను ఆహ్వానించారు. ఈ ఏడాది సమంతతోపాటు.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్, నటుడు రవికిషన్ కు ఆహ్వానం అందింది.

గతంలో ఈ కార్యక్రమాని అల్లు అర్జున్, రానా, అభిషేక్, తమన్నా హాజరయ్యారు. ఇక ఇప్పుడు సామ్ పాల్గొననుంది.