‘జాను’ ట్రైలర్ వచ్చేసింది..మనసులను టచ్ చేస్తోంది..

’96’ మూవీని చాలామంది తెలుగు పీపుల్ కూడా చూసేశారు. హృద్యంగా, ఓ దృష్యకావ్యంలా ఉంటుంది మూవీ. ఆ సినిమాలో బీజీఎమ్ ‌ఎక్కడైనా ప్లే అయితే మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతలా ఆ మూవీ ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది. ఎంతో ఇష్టపడి ఆ చిత్ర రీమేక్ రైట్స్ కొనుక్కొన్న నిర్మాత ‘దిల్’ రాజు..మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌నే తెలుగులో సినిమా తీయడానికి ఒప్పించాడు. ‘జాను’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో  హీరో శర్వానంద్, సమంత లీడ్ రోల్స్‌లో […]

జాను ట్రైలర్ వచ్చేసింది..మనసులను టచ్ చేస్తోంది..

Edited By:

Updated on: Jan 29, 2020 | 7:38 PM

’96’ మూవీని చాలామంది తెలుగు పీపుల్ కూడా చూసేశారు. హృద్యంగా, ఓ దృష్యకావ్యంలా ఉంటుంది మూవీ. ఆ సినిమాలో బీజీఎమ్ ‌ఎక్కడైనా ప్లే అయితే మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతలా ఆ మూవీ ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది. ఎంతో ఇష్టపడి ఆ చిత్ర రీమేక్ రైట్స్ కొనుక్కొన్న నిర్మాత ‘దిల్’ రాజు..మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌నే తెలుగులో సినిమా తీయడానికి ఒప్పించాడు. ‘జాను’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో  హీరో శర్వానంద్, సమంత లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మూవీ ఫస్ట్‌లుక్‌కు, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

సమంత, శర్వానంద్ ఇద్దరూ కూడా పరిణితి చెందిన నటనను ప్రదర్శించారు. సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోన్న ‘జాను’  ఫిబ్రవరి 7న మూవీ రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు పెట్టుకున్న ఆశలను, అంచనాలను మూవీ నిజం చేసేలా కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సి.