Salman Khan: కత్రినా కైఫ్ భర్తతో దురుసుగా ప్రవర్తించిన సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ..

|

May 27, 2023 | 11:49 AM

కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ను సల్మాన్ సెక్యూరిటీ గార్డ్స్ నెట్టేశారు. ఇప్పుడు ఇదే విషయం పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిస్కషన్ కు దారితీసింది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్‌ కూడా దురుసుగా ప్రవర్తించారు.

Salman Khan: కత్రినా కైఫ్ భర్తతో దురుసుగా ప్రవర్తించిన సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ..
Salman Khan, Vicky Kaushal
Follow us on

బాలీవుడ్ లో ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డ్స్ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ను సల్మాన్ సెక్యూరిటీ గార్డ్స్ నెట్టేశారు. ఇప్పుడు ఇదే విషయం పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిస్కషన్ కు దారితీసింది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్‌ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సల్మాన్ ఈవెంట్లో అడుగుపెడుతూనే విక్కీ కౌశల్ కు ఒక హగ్ ఇచ్చి హుందాగా ప్రవర్తించారు. కానీ ఇంతలోనే సల్మాన్ గార్డులు విక్కీని నెట్టేశారు. అంటూ ఒక వీడియో మాత్రం వైరల్ అయిపోయింది.

ఈ ఈవెంట్ లో విక్కీ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా సల్మాన్‌ ఖాన్‌ అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్‌ బాడీగార్డ్స్‌ అత్యుత్సాహంతో అందరిని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న విక్కీ కౌశల్ ను కూడా పక్కకు నెట్టేశారు. అయినా కూడా అవేమి పట్టించుకోకుండా విక్కీ సల్మాన్ ను పలకరించే ప్రయత్నం చేశారు.

కానీ సల్మాన్ మాత్రం అంతగా పట్టనట్టుగా వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సల్మాన్‌ఖాన్‌ బాడీగార్డ్స్‌ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు.ఆ తర్వాత మరో వీడియో వైరల్ అయ్యింది. కొంతమంది ఫ్యాన్స్ అందులో నిజం లేదు అంటూ.. మరో వీడియోను షేర్ చేశారు. విక్కీని సల్మాన్ హగ్ చేసుకున్న మరో వీడియోను షేర్ చేయగా ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.