
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలన్ని డార్లింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ , కల్కి చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న సలార్ చిత్రంలో ప్రభాస్ పూర్తి స్తాయిలో మాస్ అండ్ యాక్షన్ లుక్‍లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ డార్లింగ్ అభిమానులకు మరిన్ని అంచనాలను రెకెత్తించింది. ఇక దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి సలార్ ప్రమోషన్ పనులు షూరు కానున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈనెల 6న సలార్ ట్రైలర్ రాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు షాకిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో సలార్ వాయిదా పడనుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ అయ్యిందని.. అందుకు కారణం ప్రభాస్ మోకాలి సర్జరీ అంటూ ఇప్పుడు నెట్టింట ప్రచారం నడుస్తోంది. ఇక మరికొందరు మాత్రం ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఫెర్ఫెక్షన్ కోరుకుంటున్నాడని.. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని.. అందుకే సలార్ వాయిదా పడనుందని అంటున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
ఓవైపు సలార్ సినిమా వాయిదా పడలేదని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ అవాస్తవమంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట కొన్ని మీమ్స్ వైరలవుతున్నాయి. ఒకవేళ సలార్ వాయిదా పడితే ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ రియాక్షన్ ఇలా ఉంటుందంటూ పలు మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మీమ్స్ పై మీరు ఓ లుక్కెయ్యండి.
సలార్ వాయిదా పడనుందనే వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్..
Almost Confirmed – #Salaar Postponed 😑pic.twitter.com/XcWVTvHohI
— BENGALURU REBEL ™ (@RebelTweetzz) September 1, 2023
సలార్ వాయిదా పడనుందనే వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్..
Almost PostPoned #Salaar 💔 pic.twitter.com/y6VqPFHQFG
— 🐅 (@TheHulkMan0) September 1, 2023
సలార్ వాయిదా పడనుందనే వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్..
If #Salaar gets postponed, I’ll deactivate this account & quit X.#Prabhas pic.twitter.com/9mxkQgNz7F
— #ᴄᴇᴀꜱᴇꜰɪʀᴇ¹⁷ (@Vikram_147) September 1, 2023
సలార్ వాయిదా పడనుందనే వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్..
Bring #Salaar on Diwali, it is a perfect release date, can boost the collection of Salaar in hindi belt.
Bring on and you guys will have full support of all hindi audience 💥⚡ pic.twitter.com/8otSuE6OWx— 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 1, 2023
సలార్ వాయిదా పడనుందనే వార్తతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మీమ్స్..
#Rebel Postponed#Mirchi Postponed#Bahubali Postponed#Bahubali2 Postponed#Saaho Postponed#RadheShyam Postponed#Adipurush Postponed#Salaar ???? pic.twitter.com/V44UpuQtHf
— . (@raghu003__) September 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.