Salaar Movie: ఖాన్సార్ ప్రపంచాన్ని చూశారా ?.. ‘సలార్’ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన మేకర్స్..

|

Jan 07, 2024 | 12:55 PM

కేజీఎఫ్ చిత్రాలతో రికార్డ్స్ తిరగరాసిన నీల్.. ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్సాఫీస్ షేర్ చేశారు. ఇప్పటికీ ఈమూవీ థియేటర్లలో సత్తా చాటుతుంది. 16వ రోజున ఈ సినిమా రూ.5.3 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా నిన్న ఒక్కరోజే భారతదేశంలో మొత్తం రూ. 387 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 రోజుల్లో రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Salaar Movie: ఖాన్సార్ ప్రపంచాన్ని చూశారా ?.. సలార్ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన మేకర్స్..
World Of Khansar
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తున్న సినిమా ‘సలార్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ గత రికార్డ్స్ లను బద్దులకొట్టేస్తుంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది ఈ చిత్రం. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‏కు యంగ్ రెబల్ స్టార్ మాస్ నటవిశ్వరూపం చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రాలతో రికార్డ్స్ తిరగరాసిన నీల్.. ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్సాఫీస్ షేర్ చేశారు. ఇప్పటికీ ఈమూవీ థియేటర్లలో సత్తా చాటుతుంది. 16వ రోజున ఈ సినిమా రూ.5.3 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా నిన్న ఒక్కరోజే భారతదేశంలో మొత్తం రూ. 387 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 రోజుల్లో రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. సలార్ సినిమాలోని ఖాన్సార్ నగరాన్ని పరిచయం చేస్తూ వరల్డ్ ఆఫ్ ఖాన్సార్ వీడియోను షేర్ చేశారు. అందులో ఖాన్సార్ ప్రపంచం గురించి తెలియజేశారు. ఈ వీడియో మొత్తం ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది. మొత్తం ఒక నిమిషం 31 సెకండ్స్ నిడివి ఉంది. ప్రస్తుతం ఖాన్సార్ ప్రపంచం వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించగా.. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించగా.. విడుదలై 16 రోజులు గడుస్తున్న కలెక్షన్స్ సునామీ మాత్రం తగ్గడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.