తొలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రింకు రాజ్ గురు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సైరత్ మూవీ తర్వాత వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో అర్చీ పాత్రలో రింకు రాజ్ గురు నటనకు అడియన్స్ ఫఇదా అయ్యారు. ఈ మూవీ విడుదలై ఇప్పటికీ దశాబ్దం కావోస్తున్న’ఆర్చి’ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సైరత్ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటించిన రింకు రాజ్ గురు మల్టీ టాలెంటెడ్. కేవలం నటన కాకుండానే రచయితగానూ మారేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రాసిన ప్రేమ కవిత్వం సోషల్ మీడియాలో వైరలవుతుంది. రింకు రాజ్ గురు టనతో పాటు ఇతర విషయాలపై కూడా ఆసక్తి చూపుతోంది. రింకూకి చదవడం అంటే చాలా ఇష్టం. ఇది కాకుండా ఆమె స్వయంగా కవిత్వాలు కూడా రాస్తుంది… ఒక ఇంటర్వ్యూలో, రింకూ తను వ్రాసిన ఒక కవితను చెప్పింది. రింకూ ‘కమరా’ అనే కవిత రాసింది. ఇందులో ఆమె తన భావాలను వ్యక్తం చేసింది.
రింకు కవిత్వం..
అలా జరగనప్పుడు…
కాబట్టి ఆ ఖాళీ గది ఎన్నో కథలను చెబుతుంది…
బహుశా ఆ కథలన్ని అక్కడే లేని అతడి కోసమే కావచ్చు..
ఆ కథలన్నింటిని నన్ను అనుభూతి చెందనివ్వండి
నన్ను నాలో చూసుకోనివ్వండి…
ఆ కథలన్ని నాలోనూ ఉన్నాయి..
మరొకరితో మాత్రమే
అతను ఇప్పుడు నన్ను కోల్పోయి ఉండవచ్చు,
కానీ నేను అతని తప్పుడు ప్రపంచంలో అతనితో ఉన్నాను …
అతడి ఊహ ప్రపంచంలో నన్ను నేను కనుగొనడానికి నా నిజం ఏమిటి?
నేను ఇంకా ఆ ఖాళీ గదిని చూసి అనుభూతి చెందడం సరైనదేనా?
రింకూకి చదవడం అంటే ఇష్టం…
రింకూ రాజ్‌గురుకి చదవడం అంటే చాలా ఇష్టం. ఆమె వివిధ పుస్తకాలు చదువుతోంది. ఒక ఇంటర్వ్యూలో, రింకూ తన చదివే అలవాటు గురించి మాట్లాడింది. “పొద్దున లేవగానే టీ వగైరా తాగి చదవడం మొదలుపెడతాను. నేను ఎప్పుడైనా పుస్తకాన్ని చదవగలను. పుస్తకాలు ఇప్పుడు ఆడియో ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అది నాకు ఇష్టం లేదు. పుస్తక పఠనం ఒక విభిన్నమైన వినోదం. పుస్తకాన్ని నాదైన రీతిలో చదివాను. చదువుతున్నప్పుడు నాదైన రీతిలో ఊహించుకుంటున్నాను అని రింకూ రాజ్‌గురు అన్నారు .
నాకు పుస్తకం నచ్చితే రాత్రంతా చదవగలను. ఈ అలవాటును మా నాన్నగారు నాకు కల్పించారు. అలాగే నాగరాజ్దాదా కూడా కొన్ని పుస్తకాలను సూచించాడు. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నందున చదువుకు చాలా సమయం దొరికింది అని రింకూ తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.