సంగీత సామ్రాజ్ఞి జీవిత కథ: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించనున్న బ్యూటీ ఎవరో తెలుసా?

సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుల కథలను వెండితెరపైకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు, భారతదేశంలో కర్ణాటక సంగీతానికి 'రాణి'గా కొలిచిన, భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి అయిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ..

సంగీత సామ్రాజ్ఞి జీవిత కథ: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించనున్న బ్యూటీ ఎవరో తెలుసా?
Ms Subbulakshmi And Heroine

Updated on: Dec 17, 2025 | 7:30 AM

సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుల కథలను వెండితెరపైకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు, భారతదేశంలో కర్ణాటక సంగీతానికి ‘రాణి’గా కొలిచిన, భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి అయిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే, తెలుగులో ‘జెర్సీ’, ‘కింగ్‌డమ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, సుబ్బులక్ష్మి వంటి మహానటి పాత్రలో నటించబోయే నటి ఎవరు? అనే విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ గొప్ప అవకాశం దక్కించుకున్న ఆ నటి ఎవరు?

సహజమైన నటన, అద్భుతమైన హావభావాలతో దక్షిణాదిన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ సాయిపల్లవి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను పోషించబోయే ఆ నేచురల్ బ్యూటీ మరెవరో కాదు, సాయి పల్లవి. తన అద్భుతమైన హావభావాలు, పాత్రలో ఒదిగిపోయే నైపుణ్యంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి, ఈ చారిత్రక పాత్రకు ఎంపిక కావడం విశేషం.

Heroine Sai Pallavi

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తన 10వ ఏటనే హెచ్.ఎం.వి. సంస్థ కోసం పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆ తరువాత ‘సేవాసదన్’, అత్యంత ప్రజాదరణ పొందిన ‘మీరా’ వంటి నాలుగు చిత్రాలలో నటించి, కర్ణాటక సంగీతంలో శిఖరాగ్రానికి చేరుకున్నారు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సాధించిన అసాధారణ విజయాలను, 1998లో ఆమెకు లభించిన భారత రత్న గౌరవాన్ని ఈ బయోపిక్‌లో చూడబోతున్నాం. సాయి పల్లవి ప్రస్తుతం ‘రామాయణం’ సినిమాలో సీత పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి చారిత్రక, సున్నితమైన పాత్రను పోషించడానికి ఆమె సిద్ధమవడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.