Happy Birthday Sai Pallavi : అచ్చం తెలుగింటి పడుచుపిల్లలా ఆకట్టుకునే అందం.. సాయిపల్లవి

టాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సాయిపల్లవి..

Happy Birthday Sai Pallavi : అచ్చం తెలుగింటి పడుచుపిల్లలా ఆకట్టుకునే అందం.. సాయిపల్లవి

Updated on: May 09, 2021 | 7:45 AM

Happy Birthday Sai Pallavi : టాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సాయిపల్లవి. మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి. ఈ రోజు ఈ చిన్నదాని పుట్టిన రోజు.  ఈ రోజుతో ఈ అందం 29వ పడిలోకి అడుగుపెడుతుంది..సహజమైన నటనతో చక్కటి అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది పల్లవి. తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా చేసింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసేంది. ఆతర్వాత తెలుగులో సాయిపల్లవిని అవకాశాలు క్యూకట్టాయి. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రస్తుతం సాయిపల్లవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది.  ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..

Janhvi kapoor: డాక్ట‌ర్ అయ్యేంత తెలివి తేట‌లు నాకు లేవ‌ని చెప్పేశా.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన శ్రీదేవీ కూతురు..

Charmi About Her Marriage: జీవితంలో అలాంటి త‌ప్పు చేయ‌నంటున్న ఛార్మీ.. పెళ్లి వార్త‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..