Sai Durga Tej: మెగా హీరో కొత్త ప్రయాణం.. ఆ రంగంలోకి అడుగుపెట్టిన సాయి దుర్గ తేజ్.. ఎమోషనల్ ట్వీట్..

|

Mar 09, 2024 | 5:27 PM

తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయి దుర్గ తేజ్ గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పేరును అమ్మ పేరుతో మార్చుకుని సాయి దుర్గ తేజ్‏గా మారిపోయాడు. ఇక ఇదే సంతోషయంలో ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు తేజ్. ఇన్నాళ్లుగా వెండితెరపై హీరోగా అలరిస్తూ సూప్రీం హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తేజ్..

Sai Durga Tej: మెగా హీరో కొత్త ప్రయాణం.. ఆ రంగంలోకి అడుగుపెట్టిన సాయి దుర్గ తేజ్.. ఎమోషనల్ ట్వీట్..
Sai Durga Tej
Follow us on

మెగా హీరో సాయి దుర్గ తేజ్.. ఏంటీ కన్ఫ్యూజ్ అయ్యారా ?.. మెగా హీరోలలో ఈ పేరుతో ఎవరున్నారా ? అనే ఆలోచనలో పడిపోకండి.. సాయి దుర్గ తేజ్.. అలియాస్ సాయి ధరమ్ తేజ్.. తన పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయి దుర్గ తేజ్ గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పేరును అమ్మ పేరుతో మార్చుకుని సాయి దుర్గ తేజ్‏గా మారిపోయాడు. ఇక ఇదే సంతోషయంలో ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు తేజ్. ఇన్నాళ్లుగా వెండితెరపై హీరోగా అలరిస్తూ సూప్రీం హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తేజ్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. తన తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మీద నిర్మాతగా ఇక పై సినిమాలను నిర్మించనున్నాడు తేజ్. ఈ బ్యానర్ పై ఇదివరకే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తెరకెక్కింది. అదే సోల్ ఆఫ్ సత్య.

నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు సాయి దుర్గ తేజ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులను తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. తల్లి పేరు మీద నిర్మాణ సంస్థను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. “మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో దీనిని ప్రారంభించాను.. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్ రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ‘సత్య’ సినిమా టీంతో కలిసి ఈ సంస్థను స్టార్ట్ చేయడం మరింత సంతోషంగా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయనకు మెగా అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ పెట్టారు. చాలా కాలం తర్వాత హారర్ థ్లిల్రర్ నేపథ్యంలో వచ్చిన స్టోరీతో భారీ విజయాన్ని అందుకున్నాడు తేజ్. ఆ తర్వాత బ్రో సినిమాతో అలరించిన తేజ్.. ఇప్పుడు గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే తాను నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరితో సినిమా చేశానని.. ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్ చిరంజీవిగారే అని చెప్పుకొచ్చారు. చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్ చేస్తానని అన్నారు సాయి తేజ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.