AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadujeevitham Trailer: ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా ?.. ఆయన సాహసాలకు దండం పెట్టాల్సిందే..

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన ఆయన.. ఇటీవలే వెండితెరపై విలనిజం చూపించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అదే ఆడుజీవితం.సౌదీ వెళ్లిన వలస బాధితుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా శనివారం రిలీజ్ అయ్యింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టారా ?..

Aadujeevitham Trailer: ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా ?.. ఆయన సాహసాలకు దండం పెట్టాల్సిందే..
Actor
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2024 | 3:45 PM

Share

హీరోయిజం కాదు.. కథకు ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు ఈ హీరో. బ్యాక్ టూ బ్యూక్ సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఈ నటుడు.. ఎప్పుడు సరికొత్త సాహాసాలు చేసేందుకు ముందుంటాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన ఆయన.. ఇటీవలే వెండితెరపై విలనిజం చూపించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అదే ఆడుజీవితం.సౌదీ వెళ్లిన వలస బాధితుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా శనివారం రిలీజ్ అయ్యింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టారా ?.. నిజానికి ఈ హీరో టాలీవుడ్ కాదు.. మలయాళీ ఇండస్ట్రీకి చెందినవాడు. కానీ ఇటీవలే తెలుగులో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించాడు. గుర్తుపట్టారా ?.. అతడే హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.

ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఆడుజీవితం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పొట్టకూటి కోసం సౌదీకి వలస వెళ్లిన నజీబ్ మహ్మద్ అనే మలయాళీ కుర్రాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ?. అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు ఎడారి నుంచి స్వదేశానికి రావాలనుకున్నాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కోన్న పరిస్థితులు ఏంటీ ?.. చివరకు ఎలా బతికి బయటపడ్డాడు ? అనేది సినిమా. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం కేక పుట్టిస్తోంది. మూడు భిన్నమైన లుక్స్ లో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా కనిపిస్తున్నాడు పృథ్వీరాజ్. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ట్రైలర్ లో వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు పృథ్వీరాజ్. ఇక త్వరలోనే రానున్న సలార్ 2లో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..
ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే!
ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే!
అరటిపండు vs ఖర్జూరం.. తక్షణ శక్తి కోసం ఏది తినాలి..?
అరటిపండు vs ఖర్జూరం.. తక్షణ శక్తి కోసం ఏది తినాలి..?
ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్
ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్
ఈ సమయంలో బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్
ఈ సమయంలో బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!
ఆ నటుడి కుమారుడి చదువుకు శివ కార్తికేయన్ సాయం.. వీడియో ఇదిగో
ఆ నటుడి కుమారుడి చదువుకు శివ కార్తికేయన్ సాయం.. వీడియో ఇదిగో