Virupaksha: సాయి ధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ‘విరూపాక్ష’ వచ్చేది ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనేనా..

|

Apr 22, 2023 | 5:31 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్నిఏరియాలనుంచి విరూపాక్ష సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Virupaksha: సాయి ధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ విరూపాక్ష వచ్చేది ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనేనా..
Virupaksha
Follow us on

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు తేజ్. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తేజ్ నటించి మొదటి సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్నిఏరియాలనుంచి విరూపాక్ష సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో తేజ్ కు విరూపాక్ష సాలిడ్ కంబ్యాక్ అయ్యింది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకు..

విరూపాక్ష సినిమాలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటించింది. హరర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తేజ్, సంయుక్త నటన, సినిమాలో ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. సుకుమార్ రైటింగ్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డీల్ భారీ ధరకు జరిగిందని తెలుస్తోంది. విరూపాక్ష సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ థియేటర్ లో సినిమాతో పాటే అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.