సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘థాంక్స్ అని చెప్పటంలో తెలియని ఓ ఆనందం ఉంది. మా సక్సెస్‌లో పార్టిసిపేట్ చేసిన దిల్ రాజుగారికి థాంక్స్. మీడియాకు కూడా ఎంతగానో థాంక్స్. మా సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. ‘విరూపాక్ష’ సినిమాలో ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్‌ను ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమా చేసే సమయంలో నాకు మాట సరిగ్గా రాలేదు. ఆ సమయంలో నాకు సహ నటీనటులందరూ ఎంతగానో హెల్ప్ చేశారు. మా అమ్మగారికి, డైరెక్టర్ కార్తీక్ అమ్మగారికి థాంక్స్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు సపోర్ట్‌కి థాంక్స్. అందరూ హార్డ్ వర్క్ చేశారు’ అని చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్
కాగా ఇప్పటివరకు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది విరూపాక్ష సినిమా. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు తేజ్. థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన ఆయన’ మీ అందరి ఆశీర్వాదంతో విరూపాక్ష సినిమాను మే 5న హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే మే 12న కన్నడలో విడుదల చేస్తున్నాం. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.