Sai Dharam Tej: ‘ఖుషి సినిమాను రీమేక్ చేసే ఒకే ఒక్క హీరో అతనే’.. ఆసక్తిక కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్..

ఇందులో భాగంగా ఈ ముగ్గురు మెగా హీరోలకు యాంకర్ సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించగా.. తమ స్టైల్లో సమాధానాలు చెప్పి మెప్పించారు. పవర్ స్టార్ నటించిన ఖుషి సినిమాను ప్రస్తుతం మీలో ఎవరు

Sai Dharam Tej: ఖుషి సినిమాను రీమేక్ చేసే ఒకే ఒక్క హీరో అతనే.. ఆసక్తిక కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్..
Sai Dharam Tej

Updated on: Sep 01, 2022 | 8:30 AM

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గిరీశాయ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ) . ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 2న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథిలుగా పాల్గోన్నారు. ఇందులో భాగంగా ఈ ముగ్గురు మెగా హీరోలకు యాంకర్ సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించగా.. తమ స్టైల్లో సమాధానాలు చెప్పి మెప్పించారు. పవర్ స్టార్ నటించిన ఖుషి సినిమాను ప్రస్తుతం మీలో ఎవరు రీమేక్ చేస్తే సెట్ అవుతారు అని ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఆ రోల్ చేయగలిగిన హీరో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే. ఇంకెవరికీ సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక ఛావ్లా జంటగా నటించిన ఖుషి చిత్రం 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి ఎస్జే సూర్య దర్శకత్వం వహించగా.. ఈ మూవీకి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పవన్ యాటిట్యూడ్.. సాంగ్స్ యువతను మెప్పించాయి. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. పవన్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది ఖుషి సినిమా.