Sai Dharam Tej: నా డాన్సులు నాకే నచ్చడం లేదు.. షాకింగ్ విషయం చెప్పిన సాయి ధరమ్ తేజ్

తాజాగా బ్రో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మెగా మేనల్లుడు.. తన లైఫ్‌లో జరిగిన వాటిని మరోసారి రీ కాల్ చేసుకున్నారు. బాగా ఎమోషనల్ అయ్యారు కూడా.  సమ్మర్‌లో విరూపాక్షతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej: నా డాన్సులు నాకే  నచ్చడం లేదు.. షాకింగ్ విషయం చెప్పిన సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej

Edited By:

Updated on: Jul 19, 2023 | 2:01 PM

నీకింకా నూకలున్నాయిరా అంటుంటారు కదా పెద్దలు.. సాయి ధరమ్ తేజ్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయన జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. అలాంటి స్టేజ్ నుంచి బౌన్స్‌బ్యాక్ అయి వరసగా సినిమాలు చేస్తున్నారీయన. తాజాగా బ్రో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మెగా మేనల్లుడు.. తన లైఫ్‌లో జరిగిన వాటిని మరోసారి రీ కాల్ చేసుకున్నారు. బాగా ఎమోషనల్ అయ్యారు కూడా.  సమ్మర్‌లో విరూపాక్షతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. మూడు నెలలు తిరక్కుండానే మరో సినిమాతో వచ్చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్‌ను కూడా తోడు తెచ్చుకుంటున్నారు. బ్రో అంటూ ప్రేక్షకులను హాయ్ చెప్పడానికి వచ్చేస్తున్నారు మామాఅల్లుళ్లు. జులై 28న బ్రో రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు తేజ్. ఈ క్రమంలోనే చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు.

యాక్సిడెంట్ తర్వాత సరిగ్గా నిలబడటానికే తనకు చాలా టైమ్ పట్టిందని.. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజు మళ్లీ నటిస్తున్నానని.. డాన్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు తేజ్. తన బాడీ ఇప్పటి వరకు 95 పర్సెంట్ ఓకే అయిందని.. మరో 5 శాతం కోసమే బ్రేక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ హీరో. ఆ బ్రేక్ తర్వాతే సంపత్ నందితో సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు తేజ్.

డాన్సుల విషయంలో ఫ్యాన్స్ నుంచి వస్తున్న కంప్లైంట్స్ వింటున్నానని.. తన డాన్సులు తనకు కూడా నచ్చట్లేదని చెప్పారు తేజ్. కానీ నెక్ట్స్ సినిమాలో కచ్చితంగా డాన్సులు అదిరిపోతాయని మాటిచ్చారు సుప్రీమ్ హీరో. ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత.. ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయన్న తేజ్.. 100 పర్సెంట్ ఇవ్వడానికి అభిమానుల నుంచి ఇంకాస్త టైమ్ కోరుతున్నారు.