Prabhas: ప్రభాస్ సినిమాపై లేనిపోని ఊహాగానాలు.. సీరియస్ అవుతున్న డైహార్డ్ ఫ్యాన్స్..

సినిమా అండ్ పాలిటిక్స్‌... జోడుగుర్రాల సవారీ చేస్తున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan ). యంగ్‌టైగర్‌నైతే ఎప్పుడొస్తావ్ రామయ్యా అని పిలుస్తూనే ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

Prabhas: ప్రభాస్ సినిమాపై లేనిపోని ఊహాగానాలు.. సీరియస్ అవుతున్న డైహార్డ్ ఫ్యాన్స్..
Prabhas

Updated on: Apr 28, 2022 | 8:31 PM

సినిమా అండ్ పాలిటిక్స్‌.. జోడుగుర్రాల సవారీ చేస్తున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan ). యంగ్‌టైగర్‌నైతే ఎప్పుడొస్తావ్ రామయ్యా అని పిలుస్తూనే ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. ఇదే గ్యాప్‌లో మరో బిగ్ సైజ్ కటౌట్‌ని కూడా పొలిటికల్‌ సర్కిల్స్‌ రారమ్మని పిలుస్తున్నాయి. ఎవరా కటౌట్‌ స్టార్ అనేదేగా మీ డౌట్? ఇంకెవరు ఆలిండియా ఆదిపురుషుడు డార్లింగ్ ప్రభాసే.. తన సినిమాలేదో తాను చేసుకుంటూ… గల్లీ నుంచి స్టేడియం దాకా సిక్సర్లు కొడుతూ, పడుతూ లేస్తూ పాన్ ఇండియా సూపర్‌స్టార్‌ దాకా ఎదిగారు హీరో ప్రభాస్. కానీ… అడపాదడపా ఆయన కటౌట్‌ నీడలో పొలిటికల్ షేడ్స్‌ని వెతుక్కోవడం కూడా అవతలివాళ్లకు అలవాటైపోయింది. రీసెంట్‌గా ప్రభాస్ మూవీ ఆదిపురుష్‌కి మతం రంగు పులిమేశారు.

కాశ్మీర్‌ ఫైల్స్‌ తరహాలోనే బీజేపీ తీస్తున్న 15 పొలిటికల్లీ మోటివేటెడ్ సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటనే కామెంట్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హీట్ పుట్టించేసింది. పెదనాన్న క్రిష్ణంరాజుకు ఆల్రెడీ ఉన్న పొలిటికల్ బేస్‌ కూడా ఈ స్టేట్‌మెంట్‌కి ప్లస్ అవుతోంది. యంగ్ రెబల్‌స్టార్ మాత్రం ఏ మూమెంట్లోనూ రాజకీయాల వైపు మొగ్గు చూపలేదు. సినిమాలే లోకంగా ముందుకెళ్తున్నారు. రఘురాముడి ఇతిహాసాన్ని కొత్త జెనరేషన్‌కి రీఇంట్రడ్యూస్ చేస్తూ ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రయత్నమే తప్ప ఆదిపురుష్‌కి ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్సూ లేవని కౌంటర్లు పడుతున్నాయి. అటు.. సినిమా రిలీజ్‌కి ఎనిమిది నెలల ముందే ఈ విధంగా ప్రమోషన్ షురూ అయ్యింది. ఫస్ట్‌లుక్ కూడా రాకుండానే నేషనల్లీ ట్రెండింగ్ టాపిక్ అవుతోంది ఆదిపురుష్. డైహార్డ్ ఫ్యాన్స్ అయితే… మా హీరోతో పెట్టుకుంటే పులుసైపోద్ది అంటూ ఊరమాస్ ట్రోలింగ్‌ మొదలెట్టేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha Birthday: సమంతకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్.. దెబ్బకు షాక్ అయిన సామ్

Aha OTT: రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిన గేమ్ షో.. ‘సర్కార్’ సీజన్ 2 రాబోతుంది.

Sammathame: ‘సమ్మతమే’ అంటున్న కుర్ర హీరో.. కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే..