విడుదలైన 8 నెలల తర్వాత కూడా ట్రిపుల్ ఆర్ పేరు ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. మొన్న రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు.. నిన్న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినేషన్స్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు.. 25 ఏళ్ల కింద రజినీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను కూకటి వేళ్ళతో సహా పెకిలించారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. భారతీయ సినిమాను దేశాలు, ఖండాలు దాటించేసి.. ప్రపంచం ముందు గర్వంగా నిలబెట్టారు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ అయితే విడుదలైన 8 నెలల తర్వాత కూడా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా జపాన్‌లో హైయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. 25 ఏళ్లుగా ఈ రికార్డు రజినీకాంత్ పేరు మీదే ఉంది. ఆయన ముత్తు సినిమా పాతికేళ్ళ కింద ఈ రికార్డు సెట్ చేసింది.
25 ఏళ్లుగా ఎన్ని సినిమాలు వచ్చినా.. ముత్తు కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోయాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ 55 రోజుల్లోనే 2 లక్షల 71 వేల ఫుట్ ఫాల్స్‌తో పాటు.. 410 జపనీస్ మిలియన్ యిన్స్ వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్‌ను జపాన్2లో బాగా ప్రమోట్ చేసారు. రాజమౌళితో పాటు చరణ్, తారక్ సైతం జపాన్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ముత్తు పాతికేళ్ళ రికార్డు బ్రేక్ చేయగలిగింది ట్రిపుల్ ఆర్. 400 జపనీస్ మిలియన్లు యిన్స్‌తో ముత్తు రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో 300 మిలియన్లతో బాహుబలి ఉంది. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ కూడా జపాన్‌లో మంచి విజయమే సాధించింది. అక్కడ ఈ సినిమాకు జపనీస్ కరెన్సీలో 180 మిలియన్లు వచ్చాయి. ఐదు వారాల్లోనే బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ట్రిపుల్ ఆర్.. ముత్తును క్రాస్ చేయడానికి మాత్రం 55 రోజులు తీసుకుంది.
Delighted to share that #RRRMovie is now the ??????? ???????? ???? with the ??????? ???????? for ?? ?????? ???? ?? ?????!
Thank you for all the love you showered on our stars and director ever since the film’s release. ❤️? pic.twitter.com/JZsw9G8yuW
— RRR Movie (@RRRMovie) December 16, 2022
జపాన్‌లో గత 30 ఏళ్లుగా సినిమా టికెట్ రేట్లు పెరగలేదు. అంటే 1995లో విడుదలైన ముత్తు రికార్డు.. 2022లో వచ్చిన ట్రిపుల్ ఆర్ రికార్డులు సమానమే. నిజానికి ముత్తు కలెక్షన్లను రాజమౌళి సినిమా డిసెంబర్ 12నే దాటేసినా.. దాని ఫుట్ ఫాల్స్ క్రాస్ చేయడానికి మరో మూడు రోజులు అదనంగా తీసుకుంది. RRRకి ఇండియన్ కరెన్సీ ప్రకారం 23 కోట్లు వచ్చాయి. ముత్తుకు అప్పట్లోనే 22 కోట్లు వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..