RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ అంటే మామూలుగా ఉండదు మరి.. థియేటర్స్ ఓనర్లు ఏం చేశారో తెలిస్తే ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ అంటే మామూలుగా ఉండదు మరి.. థియేటర్స్ ఓనర్లు ఏం చేశారో తెలిస్తే ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్..
Rrr
Follow us

|

Updated on: Mar 21, 2022 | 7:17 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కలిసి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షూరు చేసి.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు జక్కన్న అండ్ టీం. మరోవైపు సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో థియేటర్స్ వద్ద మెగా.. నందమూరి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. బ్యానర్స్ కటౌట్స్ అంటూ ఇరువురి ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‏ను అదుపుచేసేందుకు థియేటర్ల ఓనర్లు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు..

తాజాగా విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‏లో అభిమానులు స్క్రీన్ దగ్గరకు వెళ్లకుండా పోడియంపై మేకులు బిగించారు.. అలాగే.. మరో థియేటర్‏లో స్రీన్ వద్దకు వెళ్లకుండా కంచె బిగించారు. ఇద్దరు స్టార్ హీరోలు.. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కావడంతో ఇప్పటికే థియేటర్ల వద్ద హడావిడి మొదలుపెట్టేసారు. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను ఒక తెరపై స్నేహితులుగా చూపించబోతున్నారు జక్కన్న. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. అలియా భట్.. శ్రియా సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరుగడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.

Rrr

Rrr

Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..

Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..

BSNL: కస్టమర్లకు గుడ్‏న్యూస్ అందించిన బీఎస్ఎన్ఎల్.. ఇకపై సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్.. ప్రయోజనాలెన్నంటే..