Ramchran Wishes To Chiru: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీ నెం1 హీరోగా వెలుగు వెలిగిన చిరు ఎంతో మంది అప్‌కమింగ్ హీరోలకు ఆదర్శం.
ఇక సినిమాలతో పాటు కుంటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో చిరు ముందు వరసులో ఉంటారు. ముఖ్యంగా భార్య సురేఖపై తనకున్న ప్రేమను అడపాదడపా ఇంటర్వ్యూలో బయటపెడుతూనే ఉంటాడు చిరు. ఈ జంట 1980 ఫిబ్రవరి 20న వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీంతో మెగాస్టార్ వివాహం జరిగి నేటితో 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరు తనయుడు రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. చిరంజీవి అతని భార్య కలిసిన దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన చెర్రీ.. ‘నా అతిపెద్ద బలం వీరే.. మీరిద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జోడించాడు చెర్రీ. ఇక ఈ పోస్టుకు మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమా తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన చిరు ఇప్పుడు ఏకంగా మూడో సినిమాలతో బిజీగా మారాడు.
My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary ?❤️!!@KChiruTweets pic.twitter.com/RjFyoPUbCN— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2021
Also Read: Naandhi Movie: ఇలాంటి సినిమా కోసం ఎనిమిదేళ్లు పట్టింది.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్