AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kankhajura Trailer: సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

అపరాధం, రహస్యం, ప్రతీకారం అనే అంశాలతో గ్రిప్పింగ్‌ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన ‘కాన్ ఖజురా’ మే 30 నుంచి సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. బ్లాక్ వైట్ & గ్రే : లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోలను అందించిన తర్వాత సోనీ లీవ్ నుంచి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కాన్ ఖజురా’ రాబోతోంది

Kankhajura Trailer: సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Kankhajura
Rajeev Rayala
|

Updated on: May 23, 2025 | 8:48 AM

Share

‘బ్లాక్ వైట్ & గ్రే : లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోలను అందించిన తర్వాత సోనీ లీవ్ నుంచి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కాన్ ఖజురా’ రాబోతోంది. అత్యంత ప్రతిభావంతులైన రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ‘కాన్ ఖజురా’ ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. అపరాధ భావన, రహస్యాలతో సాగించే జీవితం, ప్రతీకారంతో రగిలే వ్యక్తులను ఈ ట్రైలర్ మనకు చూపిస్తోంది. ఇది మాక్స్ (మోహిత్ రైనా), అషు (రోషన్ మాథ్యూ) అనే ఇద్దరు సోదరుల కథను మనకు చెబుతోంది. వారు జ్ఞాపకశక్తిని కోల్పోయి.. వాస్తవికతను తెలుసుకోలేక.. తమ చీకటి గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ‘కాన్ ఖజురా’ అనేది అత్యంత ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే.

నటి సారా జేన్ డయాస్ మాట్లాడుతూ.. ‘‘కన్‌ ఖజురా’లో గ్రిప్పింగ్ స్టోరీ ఉంది. అపరాధం, కుటుంబం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ఎన్నో అంశాలున్నాయి. నిషా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మల్టీ లేయర్ పాత్రను పోషించడం అంత సులభం కాదు’ అని అన్నారు.

‘కన్‌ ఖజురా’లో మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా, ఉషా నద్కర్ణి వంటి ప్రతిభావంతులైన నటీనటులు పని చేశారు. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. అజయ్ రాయ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆడమ్ బిజాన్స్కి, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్ ఈ షోను సృష్టించారు. యస్ స్టూడియోస్ లైసెన్స్‌తో రానున్న ఈ సిరీస్‌కు డోనా, షులా ప్రొడక్షన్స్ సపోర్ట్‌గా నిలిచాయి. మే 30 నుండి సోనీ LIVలో ‘కన్ ఖజురా’ ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..