Romancham OTT: చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం.. ఓటీటీ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా

హారర్‌ కామెడీ సినిమాలను ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు9 తెరపై నటీనటులు భయపడుతూ నటిస్తుంటే, సినిమా చూస్తున్న వాళ్లు తెగ ఆనందపడిపోతుంటారు. అలాంటి ఓ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

Romancham OTT: చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం.. ఓటీటీ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా
Romancham Ott Release

Updated on: Mar 29, 2023 | 5:32 PM

కోవిడ్ లాక్ డౌన్ సమయంలో.. సినిమాకు సంబంధించిన మంచి కంటెంట్ అంతా చూసేశారు జనాలు. భాష, ఆర్టిస్టులతో పనిలేదు.. విషయం ఉందిరా అని తెలిస్తే చాలు.. బంగ్లాదేశ్, యుగాండా సినిమాలు, వెబ్ సిరిస్‌లు కూడా వాచ్ చేసేశారు. ఆ తర్వాతి కాలంలో ఏ భాషా సినిమా బాగున్నా కూడా థియేటర్‌కి వెళ్లి ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా కల్చర్ పెరిగింది. ఇటీవల వచ్చిన చిన్న సినిమా కాంతారా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతెందుకు నిన్న మొన్న వచ్చిన బలగం.. ఇండస్ట్రీకి కొత్త ఊపు తెచ్చింది.

ఇక మలయాళం సినిమాల గురించి చెప్పేది ఏముంది. వారు ఎప్పుడూ మనసును తాకే సినిమాలతో మాయ చేస్తూనే ఉంటారు. ఆ కోవకే చెందిన సినిమా ‘రోమాంచం’. హారర్‌ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 3న కేరళలో 144 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 2023లో మలయాళ సినిమాల్లో మొదటి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 70 కోట్లకు వరకు వసూలు చేసింది. అలాగని ఇందులో బడా నటులు ఎవరూ లేరు. మలయాల సినిమాలు చూసేవారికి తెలిసిన సౌబిన్ షాహిర్ ఒక్కడే కనిపిస్తాడు. ఫన్ కోసం ఓయిజా గేమ్‌ ఆడే కొంతమంది ఫ్లాట్‌మేట్స్ చుట్టూ కథను అల్లుకున్నాడు డైరెక్టర్ జిత్తు మాధవన్.

కాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్‌ 7 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.