
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన అందాల భామల్లో రోజా ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రోజా.. అలాగే స్టార్ హీరోలతో టాప్ దర్శకులతో కలిసి పని చేశారు ఆమె.. సినిమాల్లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న రోజా రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రోజా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపించింది. ఇక కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఇక ఇటీవలే ఓ తమిళ్ సినిమాలో నటించారు రోజా.. కాగా ఓ ఇంటర్వ్యూలో రోజా ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనతో నటించిన హీరోలందరిలో ఆయనతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటాను అని తెలిపారు రోజా.
ఆయన ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాలయ్య రోజా కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు జంటగా నటించిన బొబ్బిలి సింహం, భైరవద్వీపం, సుల్తాన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. అప్పట్లో ఈ జోడీకి అభిమానులు ఓ రేంజ్లో ఉండేవారు.. ఇప్పటికీ రోజా, బాలకృష్ణ జంటగా అభిమానులున్నారు.. వీరిద్దరిని మరోసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆశ పడుతుంటారు. వీళ్ల కాంబోలో వచ్చిన భైరవద్వీపం సినిమా విడుదలై సుమారు 29 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
కాగా ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. నేను నటించిన హీరోల్లో బాలయ్య నాకు చాలా క్లోజ్.. ఆయన చాలా సరదా మనిషి. సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్లం.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి పార్టీలు వేరైనా.. మేము ఎప్పుడు నవ్వుతూనే పాలకరించుకునేవాళ్లం.. అసెంబ్లీ సమయంలోనూ కలిసినప్పుడు హాయ్ రోజా ఎలా ఉన్నావ్.. ఏంటి సంగతలు అని అడిగేస్తుంటారు బాలయ్య. అక్కడ ఉన్నవారందరూ షాక్ అవుతుంటారు. బాలయ్య మనసులో ఎలాంటివి ద్వేషం ఉండదు.. ఎప్పుడు కనిపించినా దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చాడు.. నోస్, ఐస్.. భైరవద్వీపం లో క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు..అని చెప్తుంటారు అంటూ రోజా గుర్తుచేసుకున్నారు.