
ఈ చిన్నది అచ్చమైన తెలుగమ్మాయ్. ఇంజనీరింగ్ చదువుకుంది. షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా నటించి.. ఆపై సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మిస్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఆపై ఓ లో-బడ్జెట్ సినిమా ద్వారా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించి.. ఓవర్‌నైట్‌లోనే స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇంతకీ ఆమెవరో గుర్తుపట్టారా.? లేదా ఓ చిన్న క్లూ ఇమ్మంటారా.. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇప్పటికైనా ఆ బ్యూటీ ఎవరో తెలిసిందా.? లేదా మేమే చెప్పేస్తాం.
పైన పేర్కొన్న ఫోటోలో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నది మరెవరో కాదు.. మన తెలుగమ్మాయ్ రీతూవర్మ. ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కేశవ’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ అభిమానులను ఆకట్టుకుని.. ఎంతో పాపులారిటీని సంపాదించింది. యువ హీరోలతో పాటు పలువురు అగ్రనటుల సరసన సైతం ఈమె నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది.