Mythri Movie Makers : నయా మూవీ మొదలుపెట్టిన మైత్రీ మూవీమేకర్స్.. హీరోయిన్‌గా సొట్టబుగ్గల లావణ్య

మత్తు వదలరా చిత్ర దర్శకుడు రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది.

Mythri Movie Makers : నయా మూవీ మొదలుపెట్టిన మైత్రీ మూవీమేకర్స్.. హీరోయిన్‌గా సొట్టబుగ్గల లావణ్య
Koratala

Updated on: Dec 01, 2021 | 9:36 AM

Mythri Movie Makers : మత్తు వదలరా చిత్ర దర్శకుడు రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి హీరోయిన్. నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రానికి చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుణ్ణం గంగరాజు కెమెరా స్వీచ్చాన్ చేయగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి  క్లాప్ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. యువ సంగీత దర్శకుడు కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?