కన్నడ చిత్రం కాంతారా తెలుగు డబ్బింగ్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి .. స్వియ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. తెలుగులో అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు రూ. 1.95 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రెండో రోజు ఈ మూవీ ఏకంగా రూ. 11.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్తో ఈ స్థాయిలో విజయం సాధించడం అరుదైన విషయం. అటు హిందీలోనూ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
కన్నడలో భారీ విజయం అందుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో 17 రోజుల కలెక్షన్లను తెలుగులో కేవలం రోజుల్లోనే రాబట్టింది కాంతారా మూవీ. రిషబ్ శెట్టి నటన.. స్క్రీన్ ప్లే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన గ్రామ దేవతగా రిషబ్ శెట్టి నటన కట్టిపడేస్తుంది.అంతేకాదు.. కాంతారా క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు అదిరిపోయిందంటున్నారు ఆడియన్స్. ఇక దేశవ్యాప్తంగా కాంతారా కలెక్షన్స్ రూ. 99 కోట్లు. ఇక నేటితో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన కేజీఎఫ్ సిరీస్ తర్వాత నిలిచిన మూడో చిత్రంగా కాంతారా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 110 కోట్లు రాబట్టింది.
ఇప్పటివరకు కాంతారా కలెక్షన్స్..
కర్ణాటక.. రూ. 79.50 కోట్లు.
తెలుగు రాష్ట్రాల్లో.. రూ. 8.25 కోట్లు.
తమిళనాడు .. రూ. 1.25 కోట్లు.
నార్త్ ఇండియా .. రూ. 10 కోట్లు.
మొత్తం రూ. 99 కోట్లు రాబట్టింది.