AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజుపై చాగంటి గారు అలా.. RGV ఇలా..

చాగంటి కోటేశ్వరరావు గారు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన శాస్త్రబద్ధమైన విధానాలను గతంలో వివరించగా, రామ్ గోపాల్ వర్మ అప్పట్లో వాటిని "అర్థరహితం"గా అభివర్ణించారు. ఆచారాలను పాటించే వారిని విమర్శిస్తూ, RGV తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఇది సాంప్రదాయ విశ్వాసాలపై భిన్నమైన దృక్పథాన్ని వెల్లడించింది.

పుట్టినరోజుపై చాగంటి గారు అలా.. RGV ఇలా..
Chaganti Koteswara Rao and Ram Gopal Varma
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2026 | 11:52 AM

Share

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పుట్టినరోజు వేడుకల ప్రాముఖ్యత, వాటిని ఆచరించాల్సిన పద్ధతులపై ఇచ్చిన గతంలో భక్తులకు తన సందేశాన్ని ఇచ్చారు. దానిపై అప్పట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రాజేశాయి. చాగంటి కోటేశ్వరరావు గారి మాటలను వీడియోలో ప్రసారం చేసిన అనంతరం, వాటిపై రామ్ గోపాల్ వర్మ స్పందనను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చాగంటి తన ప్రవచనంలో, పుట్టినరోజు అనేది తప్పకుండా జరుపుకోవాల్సిన ఒక ముఖ్యమైన సందర్భమని పేర్కొన్నారు. పుట్టినరోజును శాస్త్రబద్ధంగా జరుపుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని (శరీరానికి నూనె రాసుకుని తలస్నానం చేయడం), దీని ద్వారా అలక్ష్మి తొలగిపోతుందని తెలిపారు. తలస్నానం చేసే ముందు పెద్దలు నూనె పెట్టి ఆశీర్వదించడం ఆచారమని చెప్పారు. స్నానం చేసిన తర్వాత ఇష్టదేవతను, కులదైవాన్ని ఆరాధించాలని, ఆవుపాలు, బెల్లం ముక్క, నల్ల నువ్వులు కలిపిన పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కున కూర్చుని మూడుసార్లు లోపలికి పుచ్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా, తల్లిదండ్రులు, గురువులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం, దగ్గరలోని దేవాలయాన్ని దర్శించడం, చక్కగా మృష్టాన్న భోజనం చేయడం కూడా ఇందులో భాగమని చాగంటి అన్నారు. పుట్టినరోజు రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించడం అత్యంత ముఖ్యమని, సాంసారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నియమాలను పాటిస్తేనే పుట్టినరోజును సక్రమంగా చేసుకున్నట్లు అవుతుందని ఆయన బోధించారు.

చాగంటి ప్రవచనంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చాగంటి గారి మాటలు తనను “కత్తులతో పొడిచినట్లు” ఉన్నాయని ఆయన చమత్కరించారు. ఇలాంటి పద్ధతులను పాటించేవారికి “బ్రెయిన్స్ ఉండవు” అని, మెజారిటీ ప్రజలు ఇదే కోవలోకి వస్తారని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాంటి వారికి జీవితంలో ఎలాంటి “ఎచీవ్మెంట్” ఉండదని RGV పేర్కొన్నారు. నూనె రాసుకోవడం, పాలు తాగడం వంటివి ఎవరైనా చేయగలిగే “నాన్ సెన్సికల్” విషయాలని, ఇవి కేవలం “సైకలాజికల్ ఫీలింగ్” తప్ప ఇంకేమీ ఇవ్వవని RGV అన్నారు. ఒక వ్యక్తి నిజమైన విజయం సాధించి, ఇతరుల కంటే మెరుగ్గా ఏమైనా చేయగలడా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలి తప్ప, ఇటువంటి ఆచారాలపై కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దైవభక్తిని విమర్శిస్తూ, గుళ్ళు, దేవాలయాల్లో ఉండే భక్తులను సినిమా షూటింగ్‌లో “జూనియర్ ఆర్టిస్టులు”గా పోల్చారు. దేవుడిపై తన అభిప్రాయాన్ని అడగగా, తాను దేవుణ్ణి నమ్మనని, ఒకవేళ నమ్మాల్సి వస్తే “బెస్ట్ దేవుడు” ఎవరో చూస్తానని అన్నారు. మహేష్ బాబు వంటి పెద్ద స్టార్‌తో సినిమా తీయాలనుకున్నప్పుడు, తనకు యాక్సెస్ ఉంటే అతడితోనే తీసినట్లుగా, దేవుడి విషయంలో అందరికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి “బెస్ట్” వైపే తాను ఉంటానని వివరించారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన కేసుల గురించి ప్రశ్నించగా, తాను ఒక సెక్యులర్ దేశంలో “ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్”ను వినియోగించుకుంటున్నానని, ఏది అనొచ్చు, ఏది అనకూడదో తెలుసుకునే అవగాహనతోనే మాట్లాడతానని RGV స్పష్టం చేశారు.

Follow Us
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు