RGV: ఆర్జీవీ మామూలోడు కాదు..! ఆరాధ్య దేవి అందాలతో అదరగొట్టేసిందిగా..!!

|

Jun 18, 2024 | 7:11 PM

టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆర్జీవీ సినిమాలు కూడా ఉండేవి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివ. ఒకప్పుడు ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాక్షన్ సినిమాలే కాదు అందమైన ప్రేమ కథ చిత్రాలు కూడా తెరకెక్కించి శబాష్ అనిపించిన్నారు వర్మ. కానీ ఇప్పుడు ఆయన ఆ సినిమాల జోలికి పోవడం లేదు. బయోపిక్స్, బోల్డ్ కంటెంట్స్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అప్సర రాణి తో కలిసి ఒకటి రెండు సినిమాలు చేసిన ఆర్జీవీ ఆ అమ్మడి అందాలను ఓ రేంజ్ లో చూపించి ఆడియన్స్ ను కవ్వించారు.

RGV: ఆర్జీవీ మామూలోడు కాదు..! ఆరాధ్య దేవి అందాలతో అదరగొట్టేసిందిగా..!!
Rgv
Follow us on

ఇప్పుడంటే ఆర్జీవీ కాంట్రవర్సీ సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు ఈ సంచలన దర్శకుడు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆర్జీవీ సినిమాలు కూడా ఉండేవి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివ. ఒకప్పుడు ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యాక్షన్ సినిమాలే కాదు అందమైన ప్రేమ కథ చిత్రాలు కూడా తెరకెక్కించి శబాష్ అనిపించిన్నారు వర్మ. కానీ ఇప్పుడు ఆయన ఆ సినిమాల జోలికి పోవడం లేదు. బయోపిక్స్, బోల్డ్ కంటెంట్స్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అప్సర రాణి తో కలిసి ఒకటి రెండు సినిమాలు చేసిన ఆర్జీవీ ఆ అమ్మడి అందాలను ఓ రేంజ్ లో చూపించి ఆడియన్స్ ను కవ్వించారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఆమె పేరే ఆరాధ్య దేవి.

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయినా ఈ చిన్నదాని ఆర్జీవీ హీరోయిన్ చేశారు. అంతేనా మొన్నటివరకు చీరకట్టులో పద్దతిగా కనిపించిన ఆమెలోని మరో యాంగిల్ ను బయటకు తీశారు.. బాబోయ్ అనేంతలా ఆమె అందాలను కెమెరాలో బంధించారు వర్మ. ఆరాధ్య దేవిని సోషల్ మీడియాలో గాలించి పట్టుకున్నారు వర్మ. ఆ తర్వాత ఆమెతో శారీ అనే సినిమాను అనౌన్స్ చేశారు. మొన్నటివరకు పోస్టర్స్ తో పిచ్చెక్కించిన ఆర్జీవీ. తాజాగా ఈ సినిమానుంచి ఓ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు.

ఓ జలపాతం కింద హీరోయిన్ తడుస్తూ డాన్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో ఆరాధ్య దేవి తన అందాలతో ఆకట్టుకుంది. నీళ్లలో తడుస్తూ నెమలిలా నాట్యం చేస్తూ అదరగొట్టింది ఆ అమ్మడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. విశేషం ఏంటంటే దాదాపు 5 నిముషాలు ఉన్న ఈ వీడియోలో ఎక్కడా కూడా సాంగ్ లేదు.. ఓన్లీ మ్యూజిక్ తోనే నడిపించారు. మధురమైన మ్యూజిక్ కు మతిపోగోట్టే డాన్స్ చేసింది ఆరాధ్య దేవి. ఆమె డాన్స్ చేస్తుంటే లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా ఆ సాంగ్ ను క్రియేట్ చేశారు వర్మ. ఏది ఏమైనా అందాలను మరింత అందంగా చూపించడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆరాధ్య దేవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.