Tollywood: ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. మెగా ఫ్యామిలీలో స్పెషల్ పర్సన్..
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు.. వారి కుటుంబాలకు ఉండే ఫ్యాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు టాప్ హీరో గారాలపట్టి చిన్నప్పటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. క్యూట్ క్యూట్‌గా చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ చిన్నారి మెగా ఫ్యామిలీలో చాలా స్పెషల్ పర్సన్.
సోషల్ మీడియాలో ఎప్పుడూ సినీతారల చిన్ననాటి ఫోటోస్ వైరలవుతుంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అందరి బాల్యం తాలూకు జ్ఞాపకాలను అభిమానులు నెట్టింట షేర్ చేస్తుంటారు. ఇక తమ హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాగే తమ అబిమాన హీరో కూతురు, కొడుకు ఎప్పుడెప్పుడు సినీ ఎంట్రీ ఇస్తారా అని ఆరా తీస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు.. వారి కుటుంబాలకు ఉండే ఫ్యాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు టాప్ హీరో గారాలపట్టి చిన్నప్పటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. క్యూట్ క్యూట్‌గా చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ చిన్నారి మెగా ఫ్యామిలీలో చాలా స్పెషల్ పర్సన్. తను మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు ఆద్య. ఆమె చిన్నప్పటి ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులు అకిరా నందన్.. ఆద్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. అలాగే ఆద్య, అకిరాలకు సంబంధించిన విషయాలను రేణు దేశాయ్ అభిమానులతో పంచుకుంటారు. ఇప్పటికే అకిరా ఎప్పుడెప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కానీ అకిరా మాత్రం నటనవైపు కాకుండా మ్యూజిక్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే గతంలో బుల్లితెరపై నిర్వహించిన ఈ రియాల్టీ షోలో ఆద్య సందడి చేసింది. తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి రియాల్టీ షోకు హాజరయ్యింది.
ఇదిలా ఉంటే.. మార్చి 23న ఆద్య పుట్టిన రోజు. నేటితో ఆద్య పద్నాలుగో ఏటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా తన కూతురికి విషెస్ తెలుపుతూ ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు రేణు దేశాయ్. ఆద్య చిన్నప్పటి వీడియోను పంచుకున్నారు. అందులో ఆద్య క్యూట్ క్యూట్ గా ఐ లవ్ యూ అని చెబుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుడంగా.. ఆద్యకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. అలాగే వచ్చే నెలలో అకిరా బర్త్ డే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అకిరా 20వ ఏటలోకి అడుగుపెట్టనున్నాడని రేణు దేశాయ్ రాసుకొచ్చారు. దీంతో అకిరా, ఆద్య ఇద్దరికి విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. అకిరా పుట్టినరోజు ఏప్రిల్ 8. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా బెంగుళూరులో మెగా ఫ్యామిలీ చేసిన సెలబ్రెషన్లలో అకిరా , ఆద్య ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.