Regina Cassandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ క్రేజీ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా ఈ హాట్ బ్యూటీ..

|

Sep 23, 2021 | 7:12 AM

సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా మాయమైన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.. అయితే ఈ అమ్మడు మాత్రం అలా అవ్వకూడదని తెగ ప్రయత్నిస్తుంది.

Regina Cassandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ క్రేజీ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా ఈ హాట్ బ్యూటీ..
Regina Cassandra
Follow us on

Regina Cassandra: సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా మాయమైన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.. అయితే ఈ అమ్మడు మాత్రం అలా అవ్వకూడదని తెగ ప్రయత్నిస్తుంది. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది రెజీనా కాసాండ్రా. రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. త్వరలోనే ఈ బ్యూటీ నేనేనా అనే హారర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజీ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. బాలీవుడ్‌లో  రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో ఓ హీరోయిన్‌గా రెజీనా కాసాండ్రాను ఎంపిక చేశారని తెలుస్తుంది. రాజ్ – డీకే లు వరుసగా బాలీవుడ్‌లో సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో త్వరలో ఈ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో హీరోగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అమోల్ పాలేకర్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ వెబ్ సిరీస్ రెజీనా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.  తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న రెజీనా ఈ వెబ్ సిరీస్‌లో నటించడం వల్ల ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రాశిఖన్నా హీరోయిన్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.. రాజ్ -డీకేలు రూపొందించిన  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇద్దరూ చేస్తున్న వెబ్ సిరీస్ పై అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ఎన్నికల బరిలోకి విష్ణు.. మరికాసేపట్లో తన ప్యానెల్‌ను ప్రకటించనున్న మంచు వారబ్బాయి..

Bigg Boss Ariyana: గుడ్ న్యూస్ షేర్ చేసిన అరియనా గ్లోరి.. అంతా దేవుడి చల్లని దీవెన అంటూ..

SIIMA Awards 2021 Photos: సైమా అవార్డ్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫొటోస్.. చిరు – విశ్వనాథ్ అనుబంధం హైలెట్