‘జాన్’ షెడ్యూల్‌కి అందుకే గ్యాప్ వచ్చిందా..?

|

Dec 20, 2019 | 9:27 PM

‘సాహో’ మూవీ ఫలితం ఎలా ఉన్నా నిర్మాతలకు మాత్రం పెద్ద కనువిప్పును కలిగించింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అందులో నో డౌబ్డ్. అయితే బడ్జెట్ విషయంలో కాస్తా, వెనకా ముందు ఆలోచించడం అవసరం. భారీ బడ్జెట్ పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినా..అందులో నిర్మాతలకు పెద్దగా మిగిలేది ఉండదు. అదే తక్కువ బడ్జెట్‌‌‌లో సాలిడ్ హిట్ ఇస్తే అటు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగని సినిమా […]

జాన్ షెడ్యూల్‌కి అందుకే గ్యాప్ వచ్చిందా..?
Follow us on

‘సాహో’ మూవీ ఫలితం ఎలా ఉన్నా నిర్మాతలకు మాత్రం పెద్ద కనువిప్పును కలిగించింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అందులో నో డౌబ్డ్. అయితే బడ్జెట్ విషయంలో కాస్తా, వెనకా ముందు ఆలోచించడం అవసరం. భారీ బడ్జెట్ పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినా..అందులో నిర్మాతలకు పెద్దగా మిగిలేది ఉండదు. అదే తక్కువ బడ్జెట్‌‌‌లో సాలిడ్ హిట్ ఇస్తే అటు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగని సినిమా స్థాయిని తగ్గించేయమని కాదు..పెట్టే ఖర్చలోనే కాస్తా పొదుపు మంత్రం జపించాలి.

ఇప్పుడు అదే బాటలో పయనిస్తారు  ప్రభాస్ ‘జాన్’ మూవీ నిర్మాతలు. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెకుతోన్న ఈ చిత్రాన్ని గోపాల్‌కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాహో విడుదల కంటే ముందే ‘జాన్’ మూవీ స్టార్టయ్యింది. వాస్తవానికి ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను చాలా భారీగా, రిచ్ లుక్‌తో తీయాలని భావించారు. అయితే సాహో ఊహించని విధంగా నష్టాలను మిగల్చడంతో..చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని నిర్మాతలు డిసైడయ్యరట. దీంతో బడ్జెట్ విషయంలో మొదట వేసినవి కాకుండా తిరిగి ప్రణాళికలు వేయడం ప్రారంభించారు. మొత్తం మీద రూ 200 కోట్ల లోపులో చిత్రాన్ని కంప్లీట్ చేస్తే..ప్రభాస్ మూవీ ఎలా ఉన్నా సేఫ్ అవుతుందని లెక్కలు వేస్తున్నారట. అందుకే ‘జాన్’ చిత్ర షెడ్యూల్‌‌ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మరి నిర్మాణ సంస్థల తాజా ఆలోచనలతో ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాలి. రాధాక‌ృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.