
కొద్ది రోజులుగా RAW ఎన్టీఆర్ సంస్థ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి వెలువడిన పోస్టర్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించింది RAW ఎన్టీఆర్ టీమ్. ఈ సందర్భంగా RAW ఎన్టీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ చేపట్టనున్న ఊరు వాడ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా తమ సంస్థ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని.. ప్రజలలో నెలకొన్న అనుమానాలను క్లియర్ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం తమకు లేదని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే తాము చేపట్టనున్న సేవా యజ్ఞంలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయని తెలిపారు. మొదటిది సేవతో యువ జాగృతి, రెండోది మన ఊరు మన బాధ్యత, మూడోది ఊరిమాట పాలకులు దాక. ఈ మూడు విభాగాలు తమ సంస్థలో ప్రధానమని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..
సేవతో యువ జాగృతి.. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు.
మన ఊరు మన బాధ్యత.. గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి , స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి.. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఊరి మాట పాలకులదాకా.. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధింత ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యకమం ప్రారంభం అవుతుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..
ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు తమ సంస్థ ఎప్పటికీ చేయబోదని సాయి రూప్ స్పష్టం చేసారు. ఎన్టీఆర్ నాటిన ఒక విత్తనమే తామని.. ఇప్పుడు తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. వంద కోట్ల మోసగాడు అంటూ.. అభిమానుల ముసుగులో దందా చేస్తున్నారని వస్తున్న అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ కు సంబంధం లేకుండా తమకు వ్యతిరేఖంగా లేఖ విడుదల అయినట్లు అనుమానిస్తున్నామని.. తమకు వ్యతిరేఖంగా లేఖ ఎలా వచ్చిందో అర్థం కాలేదని అన్నారు. ఎన్టీఆర్ స్వయంగా చెబితే ఈ పనులు ఆపేస్తామని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..