Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన మాస్ రాజా

|

Jul 15, 2022 | 7:26 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన మాస్ రాజా
Megastar Chiranjeevi, Ravit
Follow us on

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమాను నుంచి మెగాస్టార్ లుక్ తోపాటు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే తమిళ్ సినిమా వేదాళం సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమానుంచిఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది.

అలాగే బాబీ దర్శకత్వంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ 154వ సినిమా గా వస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాలో నటించాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రవితేజ కు ఇప్పటికి ఆ ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ ని హైదరాబాదులో స్టార్ట్ చేశారు.  ఈ షూటింగ్ లో రవితేజ కూడా పాల్గొంటున్నాడు. ఒక వారం రోజులు వరకు చిరంజీవి రవితేజకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి