Dhamaka Movie Twitter Review: పక్కా మాస్ ఎంటర్టైనర్ ధమాకా ట్విట్టర్ రివ్యూ..

|

Dec 23, 2022 | 7:43 AM

ఈ సినిమాలో రవితేజకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Dhamaka Movie Twitter Review: పక్కా మాస్ ఎంటర్టైనర్ ధమాకా ట్విట్టర్ రివ్యూ..
Dhamaka
Follow us on

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రవితేజ ఈ సినిమాతో హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భీమ్స్ సిసిరోలియో ధమాకా సినిమాకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.