Jr.NTR- Rashmika: తారక్ అభిమానులకు బిగ్ సర్‏ప్రైజ్.. ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్నా.. ఏ సినిమాలో అంటే..

|

May 24, 2024 | 2:21 PM

కొన్ని రోజులుగా వార్ 2 షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటున్న తారక్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ నెక్ట్స్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే.. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట.

Jr.NTR- Rashmika: తారక్ అభిమానులకు బిగ్ సర్‏ప్రైజ్.. ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్నా.. ఏ సినిమాలో అంటే..
Jr.ntr, Rashmika
Follow us on

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు దేవర.. ఇటు వార్ 2 చిత్రీకరణలలో పాల్గొంటూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా వార్ 2 షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటున్న తారక్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ నెక్ట్స్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే.. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.

దేవర షూటింగ్ ముగిసిన వెంటనే నీల్, తారక్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతున్నందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. ఇందులో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే రష్మికను సెలక్ట్ చేయాలనుకుంటున్నారట.

ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జు్న్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా అటు విజయ్ దేరవకొండ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇక ఇటు తారక్ సినిమాకు సైతం రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇక ఇదే నిజమైతే తారక్ అభిమానులకు ఇది క్రేజీ కాంబోనే. ఎన్టీఆర్ కు సరైన జోడీ రష్మిక అంటూ నెట్టింట చర్చ కూడా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.