Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మళ్లీ ఇక్కట్లు పడ్డ నేషనల్‌ క్రష్‌.. నెట్టింట్లో వీడియోలు వైరల్‌

|

Jul 16, 2022 | 9:01 PM

ప్రస్తుతం సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది రష్మిక రష్మిక మందన్నా (Rashmika Mandanna). పుష్ప సినిమాతో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతోంది. ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌గా

Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మళ్లీ ఇక్కట్లు పడ్డ నేషనల్‌ క్రష్‌.. నెట్టింట్లో వీడియోలు వైరల్‌
Rashmika
Follow us on

ప్రస్తుతం సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది రష్మిక రష్మిక మందన్నా (Rashmika Mandanna). పుష్ప సినిమాతో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతోంది. ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌గా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో జరిగిన ఓ అవార్డ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది. ఈ ఫంక్షన్‌లో రష్మిక రెడ్ కలర్ షార్ట్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. దీంతో ఫొటోగ్రాఫర్లు రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆమెను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. పైకి నవ్వుతున్నప్పటికీ రష్మిక కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్‌ ఆమె మోకాలి పై వరకు మాత్రమే ఉంది. దీంతో తన కాళ్లు కవర్‌ చేసుకునేందుకు నేషనల్‌ క్రష్‌ ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అయితే ఇలా పొట్టి డ్రస్సులతో ఇబ్బంది పడడం రష్మికకు ఇదేమి మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఆమెకు ఎదురయ్యాయి. బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్‌ షార్ట్ డ్రెస్‌ ధరించి దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్‌లో నడవడానికి ఇబ్బంది పడిన రష్మికను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. తాజాగా ఈ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు మరోసారి టార్గెట్‌ అయ్యేలా ఉంది. కాగా ఇదే అవార్డ్స్‌ ఫంక్షన్‌లో మరోసారి పుష్ప హుక్‌ స్టెప్‌ను వేసింది. సామిసామి అనే పాటకు మరోసారి కాలు కదిపి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక నటించిన సీతారామం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం తెలుగులో పుష్ప2, వారసుడు సినిమాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మిషన్‌ మజ్ఞు, గుడ్‌బై, యానిమల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..