ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీ.. కానీ కండీషన్స్ అప్లై! రెమ్యూనరేషన్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్​!

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుండి ప్రయాణం మొదలుపెట్టి, టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారి అభిమానులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌ స్టేటస్‌ అనుభవిస్తోంది.

ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీ.. కానీ కండీషన్స్ అప్లై! రెమ్యూనరేషన్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్​!
Star Heroine...

Updated on: Jan 22, 2026 | 8:10 PM

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలన్ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తాజాగా తన కెరీర్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి రష్మిక ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐటమ్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమేనని చెబుతూనే, దర్శక నిర్మాతలకు ఒక గట్టి షరతు విధించింది. ఆ షరతు ఏంటి? తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు రష్మిక ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసుకుందాం.

రష్మిక మందన్న ప్రయాణం ‘ఛలో’ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ ఆమెను యువత ఆరాధ్య దైవంగా మార్చేసింది. ఇక ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ స్టార్‌గా ఎదిగింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన నటించిన రష్మిక, ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తనలోని నటిని మరోసారి నిరూపించుకుంది.

Rashmika Mandanna

స్పెషల్ సాంగ్స్ – రష్మిక కండీషన్..

చాలామంది స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ (ఐటమ్ సాంగ్స్) లో మెరుస్తుంటారు. దీనిపై రష్మిక మాట్లాడుతూ.. “నాకు స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఉంది, కానీ నాదో చిన్న కండీషన్. ఆ సినిమాలో నేనే హీరోయిన్‌గా ఉండాలి, అప్పుడే స్పెషల్ సాంగ్ చేస్తాను. అయితే కొందరు స్పెషల్ డైరెక్టర్ల కోసం మాత్రం నా ఈ షరతును పక్కన పెట్టి సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని వెల్లడించింది. తన అభిమానులకు అన్ని జానర్లలో వినోదాన్ని అందించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ రష్మికేనని వస్తున్న వార్తలపై ఆమె సరదాగా స్పందించింది. “అందులో ఎలాంటి నిజం లేదు, కానీ ఆ రూమర్ నిజం అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను” అంటూ నవ్వేసింది. ఇక విజయ్ దేవరకొండతో ప్రేమ, నిశ్చితార్థం మరియు పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు “సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతాను” అని సమాధానాన్ని దాటవేసింది.

రష్మిక చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మైసా.. తెలుగులో రాబోతున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా. బాలీవుడ్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాక్టెయిల్ 2. అట్లీ-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లో రష్మిక మొదటిసారి విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు ప్రయోగాత్మక పాత్రలతో రష్మిక తన కెరీర్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటోంది. ఈ ఏడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందన్న వార్తల మధ్య, సినిమాల విషయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.