Rashmika Mandanna: రెమ్యునరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్.. కౌంటరిచ్చిన రష్మిక.. ఇకపై అలా చేస్తానంటూ..

ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈబ్యూటీ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ జోడిగా గీతాంజలి పాత్రలో తన నటనతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఓవైపు తెలుగులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. అటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు

Rashmika Mandanna: రెమ్యునరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్.. కౌంటరిచ్చిన రష్మిక.. ఇకపై అలా చేస్తానంటూ..
Rashmika Mandanna

Updated on: Feb 07, 2024 | 7:00 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్. సౌత్ టూ నార్త్ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అటు హిందీలో.. ఇటు తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈబ్యూటీ. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ జోడిగా గీతాంజలి పాత్రలో తన నటనతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో తెలుగు, హిందీ, తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఓవైపు తెలుగులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. అటు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన రెమ్యునరేషన్ పెంచినట్లు వస్తున్న వార్తలపై కౌంటరిచ్చింది ఈ బ్యూటీ.

యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రష్మిక రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చర్కర్లు కొడుతుంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 కోట్లు నుంచి రూ. 5కోట్లు వరకు అడుగుతుందని టాక్ నడుస్తుంది. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ పోస్ట్ చేయడంతో రష్మిక రిప్లై ఇచ్చింది.

“నేను ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఇది ఆలోచించాలనుకుంటున్నాను. నిర్మాతలను మీరు చెప్పిన రెమ్యునరేషన్ అడుగుతాను. ఒకవేళ నిర్మాతలు ఎందుకు అని అడిగితే అక్కడ మీడియా ఇలానే చెబుతుంది.. నేను వారి మాటలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.. నేనేం చేస్తాను అని చెప్తాను” అంటూ కౌంటరిచ్చింది. ప్రస్తుతం రష్మిక ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఫిల్మ్ వర్గాల టాక్ ప్రకారం.. ఒక్కో సినిమాకు రష్మిక రూ. 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.