Rashmika Mandanna: అందరూ మంచివాళ్లు కాదు.. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి.. రష్మిక పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Rashmika Mandanna: అందరూ మంచివాళ్లు కాదు.. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి.. రష్మిక పోస్ట్ వైరల్
Rashmika Mandanna

Updated on: May 03, 2025 | 4:19 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇటీవలే హిందీలో సల్మాన్ సరసన సికిందర్ అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా ఉంది.రష్మిక మందన్న సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అలాగే డైరీ పేరుతో రెగ్యులర్ గా కొన్ని విషయాలను పంచుకుంటుంది. సమాజంలో జరిగే విషయాల గురించి కూడా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా చిన్న పిల్లలకు, అమ్మాయిలకు కొన్ని సలహాలు ఇచ్చింది రష్మిక మందన్న.

“ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్లాలని బయలుదేరా.. అక్కడి నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఎలాగో షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని ఇంటికి వెళ్ళాను. కొన్ని పనులు, పెండింగ్ ఉన్న పనులు చూసి షాక్ అయ్యా.. షూటింగ్ లో ఉంటే ఇవేమీ గుర్తుకురావు. ఇలా షూటింగ్ క్యాన్సిల్ అయితే కానీ మనం చేయాల్సిన పనులు గుర్తుకువస్తాయి. మా చెల్లి బర్త్ డే అని సాయంత్రం ఫోన్ చేశా.. ఫోన్ మాట్లాడుతూ ఎంతో సమయం గడిచిపోయింది. ఆతర్వాత కొన్ని ట్వీట్లకు రిప్లై ఇచ్చా.. వర్కౌట్లు చేయడానికి టైం దొరకలేదు అందుకని కార్డియో మాత్రమే చేశా.. ఆతర్వాత డిన్నర్ చేశా.. మళ్లీ మా అమ్మ, చెల్లితో మాట్లాడా.. ఆ తరువాత హాయిగా నిద్రపోయా. టైం స్పీడ్ గా అయిపోతుందంటే నేను మంచి లైఫ్‌ను లీడ్ చేస్తున్నాను అని అర్ధం.. ఇక చిన్న పిల్లలు అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే.. మనం ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నామో ముందు తెలుసుకోండి. అందరూ చెడ్డవారు కాకపోవచ్చు కానీ మనం స్నేహం చేసే వ్యక్తి కూడా మంచి వాళ్లు కాకపోవచ్చు.. ఈ రోజు నీ ఫ్రెండ్ కావొచ్చు.. రేపు నీ ఫ్రెండ్ కాకపోవచ్చు.. మీ ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పేరెంట్స్ ను ప్రేమించండి, గౌరవించండి.  తల్లి దండ్రుల ప్రేమను లైట్ తీసుకోకండి.. వారు ఇచ్చే సలహాలతో ముందుకు సాగండి” అంటూ రాసుకొచ్చింది రష్మిక. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి