Rashmika Mandanna: మరోసారి డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడిన రష్మిక.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ..

|

Oct 15, 2024 | 6:37 PM

అలాగే మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నకు సంబందించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న ముఖాన్ని మరో అమ్మాయి వీడియోకు ఎడిట్ చేసి..

Rashmika Mandanna: మరోసారి డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడిన రష్మిక.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ..
Rashmika
Follow us on

సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎదో ఒక దాని పై నెటిజన్స్ హీరోయిన్స్ ను సినీ సెలబ్రెటీలు ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగే మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నకు సంబందించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న ముఖాన్ని మరో అమ్మాయి వీడియోకు ఎడిట్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు సైబర్ నేరగాళ్లు . ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ముఖాన్నియాడ్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో పెద్ద దుమారం రేగింది. దీని పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు.

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

ఇలాంటి ఫేక్ వీడియోను చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రష్మిక కూడా సీరియస్ అయ్యింది. ఆతర్వాత చాలా మంది వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న మరోసారి తన డీప్ ఫేక్ వీడియోల పై స్పందించింది.

ఇది కూడా చదవండి : మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

తాజాగా భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‪‌గా హీరోయిన్ రష్మిక మందన్నను నియమించింది. అలాగే ఆమెతో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు రష్మిక సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక మాట్లాడుతూ.. ” కొన్ని రోజుల క్రితం నా డీప్ ఫేక్ వీడియోని కొందరు నేరగాళ్లు చాలా వైరల్ చేశారు.అది చాలా పెద్ద సైబర్ నేరం. అప్పటి నుంచే ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కేంద్ర హోం అఫైర్స్ శాఖలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తోంది. ఆ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్. సైబర్ నేరగాళ్లు ఎలా దాడి చేస్తారో  ఎవ్వరం చెప్పలేం. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పుకొచ్చింది రష్మిక.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.