రష్మీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ లుక్

|

Sep 09, 2020 | 3:48 PM

యాంకర్ రష్మీ..ఈ పేరు వింటే చాలు..కుర్రకారు గుండెల్లో గుబులు రేగుతుంది. బుల్లి తెరమీదేే కాదు, వెండి తెర మీద కూడా రష్మీకి మంచి ఫాలోయింగ్ ఉంది.

రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ లుక్
Follow us on

యాంకర్ రష్మీ..ఈ పేరు వింటే చాలు..కుర్రకారు గుండెల్లో గుబులు రేగుతుంది. బుల్లి తెరమీదేే కాదు, వెండి తెర మీద కూడా రష్మీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమాలో నటించిందంటే యూత్ థియేటర్స్ కు పరుగులు పెడుతుంది. అమ్మడు ఇచ్చే  గ్లామర్ డోస్ అలాంటిది మరి.  ‘గుంటూరు టాకీస్’ సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఎందుకో చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది రష్మీ. ప్రస్తుతం ఈ భామ..  హీరో నందుతో కలిసి నటిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. విజయూభవ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాకి లఘు చిత్రాలతో పేరు తెచ్చుకున్న రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రష్మీ గౌతమ్‌ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్.  వాణి పాత్రలో  రష్మీ గౌతమ్‌ నటిస్తోన్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. మరి ఈ సుందరాంగి ఈ చిత్రంతో ఎంతమంది మనసులు కొల్లగొడుతుందో చూడాలి.

 

Also Read :

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన !