Animal OTT : యానిమల్ ఓటీటీ పై క్రేజీ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడవుతుందో తెలుసా..

|

Dec 07, 2023 | 12:41 PM

యానిమల్ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. డిసెంబర్ 1న యానిమల్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యానిమల్ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రణ్‌బీర్‌, రష్మికలతో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ, శక్త్‌ కపూర్‌లు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Animal OTT : యానిమల్ ఓటీటీ పై క్రేజీ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడవుతుందో తెలుసా..
Animal Movie
Follow us on

నటుడు రణబీర్ కపూర్, నటి రష్మిక మందన నటించిన ‘యానిమల్’ ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. యానిమల్ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. యానిమల్ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. డిసెంబర్ 1న యానిమల్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యానిమల్ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రణ్‌బీర్‌, రష్మికలతో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ, శక్త్‌ కపూర్‌లు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.. కానీ ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే యానిమల్ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్దకు భారీగా వస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది సినిమా చూడలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొత్త సినిమా రిలీజైన తర్వాత 45 నుంచి 60 రోజుల్లోనే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది. ఇక ఇప్పుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ముఖ్యంగా ‘యానిమల్’ సినిమా విడుదలైన కొన్ని గంటలకే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. పలు వెబ్‌సైట్‌లు యానిమల్ సినిమా పైరసీ అయ్యింది . ప్రస్తుతం ‘యానిమల్‌’ సినిమాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది హాట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘యానిమల్’. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా యానిమల్ సినిమా 500 కోట్లు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.