AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor: ఆలియా ఆ విషయాల గురించి పట్టించుకోదు.. ఆసక్తికర విషయం చెప్పిన రణబీర్

పుష్పలాంటి సినిమా తనకు పడి ఉంటే బావుండేదన్నది రణ్‌బీర్‌ చెబుతున్న మాట. అంతే కాదు, వీలైనంత త్వరలో రాజమౌళితో సినిమా చేయాలని ఉందని అన్నారు ఈ హీరో.

Ranbir Kapoor: ఆలియా ఆ విషయాల గురించి పట్టించుకోదు.. ఆసక్తికర విషయం చెప్పిన రణబీర్
Ranbir Kapoor
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2023 | 6:31 AM

Share

ప్రతి ఒక్కరికీ జీవితంలో గోల్స్ ఉంటాయి. వాటిని వాళ్లు ఎన్నేళ్లు సస్టయిన్‌ చేస్తారో తెలియదు కానీ, నేను మాత్రం ఏడాదికీ, రెండేళ్లకూ గోల్స్ మార్చుకుంటూ ఉంటాను అని అంటున్నారు రణ్‌బీర్‌ కపూర్‌. ప్రతి రెండేళ్లకీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మార్పు కనిపిస్తూనే ఉంటుంది. ఆ మార్పులకు అనుగుణంగా నా లక్ష్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటుంటాయి అని అన్నారు రణ్‌బీర్‌. పుష్పలాంటి సినిమా తనకు పడి ఉంటే బావుండేదన్నది రణ్‌బీర్‌ చెబుతున్న మాట. అంతే కాదు, వీలైనంత త్వరలో రాజమౌళితో సినిమా చేయాలని ఉందని అన్నారు ఈ హీరో. ఎవరూ ఊహించని స్క్రిప్టులతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయాలని ఉంది. కొత్తవాళ్లతో పనిచేయాలన్న థాట్‌ ప్రాసెస్‌ నడుస్తోంది అని చెబుతున్నారు బాలీవుడ్‌ చాక్లెట్‌ బోయ్‌

పెళ్లయ్యాక పాప పుట్టాక కూడా రొమాంటిక్‌ కామెడీ సినిమాలు చేస్తారా? చాక్‌లెట్‌ బోయ్‌ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది రణ్‌బీర్‌కి. దీనికి కాస్త డిఫరెంట్‌గా ఆన్సర్‌ చేశారు రణ్‌బీర్‌. పెళ్లికీ, రొమాంటిక్‌ సినిమాలకూ సంబంధం లేదుగానీ, ఇప్పుడు రొమాంటిక్‌ సినిమాల ట్రెండ్‌ లేదన్నది నా ఫీలింగ్‌ అని చెప్పారు.

స్క్రీన్‌ మీద హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే ఆలియా ఒప్పుకోవట్లేదట కదా.? అనే ప్రశ్నకు కూడా సరదాగా స్పందించారు రణ్‌బీర్‌. ఆమె అంత చిన్న విషయాల గురించి పట్టించుకోదు. షో బిజ్‌ గురించి మా ఇద్దరికీ తెలియనిదేమీ లేదు. ఇద్దరం ఇదే ఫీల్డ్ లో ఎదిగిన వాళ్లం. అలాంటి చిన్న విషయాలను అలా పట్టించుకోం. ఇవన్నీ ఎవరో పుట్టిస్తున్న గాసిప్స్. ఇలాంటివాటిని విని నవ్వుకుంటుంటాం అని అన్నారు రణ్‌బీర్‌.

Follow Us
బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్..
బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్..
వారం రోజుల్లో రైతుల అకౌంట్లోకి నిధులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
వారం రోజుల్లో రైతుల అకౌంట్లోకి నిధులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
తమన్నా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ చెల్లిని కాపాడుకోపోవడం.. ఈ సమాజం చేసిన తప్పు కాదా..?
ఈ చెల్లిని కాపాడుకోపోవడం.. ఈ సమాజం చేసిన తప్పు కాదా..?
బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?
బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?