Ranbir Kapoor: రణబీర్ కపూర్ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం.. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి.

Ranbir Kapoor: రణబీర్ కపూర్ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Ranbir Kapoor

Updated on: Jul 31, 2022 | 7:07 AM

సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం.. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మొన్నామధ్య కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 సిట్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఆ ప్రమాదంలో పలువురు టెక్నీషియన్స్ మృతి చెందారు. తాజాగా మరో సినిమా సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. సెట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) తాజాగా లవ్ రంజాన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో సెట్ లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.

సినిమా కోసం వేసిన సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు సెట్ మొత్తం వ్యాపించాయి. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ ముంబై లో ప్రారంభం అయ్యింది. ముంబై అంధేరీలోని చిత్రకూట్ మైదానంలో ఓ భారీ సెట్ వేశారు చిత్రయూనిట్. ఈసెట్ లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మనీశ్ దేవాశీ అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించగా మరికొందరు గాయపడ్డారు. వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపుచేయడంతో ప్రమాదం మరింత తీవ్రతరం కాలేదు. ఊహించని ప్రమాదంతో చిత్రయూనిట్ షాక్ తింది. ఇక ప్రమాద సమయంలో సెట్ లో హీరో , హీరోయిన్లు లేరట..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.