Virata Parvam: ‘చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం’..! విరాటపర్వం “ది వాయిస్ ఆఫ్ రవన్న”

దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్  పవన్ కళ్యణ్ తో కలిసి రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Virata Parvam: చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం..! విరాటపర్వం ది వాయిస్ ఆఫ్ రవన్న

Updated on: Dec 14, 2021 | 11:24 AM

Virata Parvam: దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. పవర్ స్టార్  పవన్ కళ్యణ్ తో కలిసి రానా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రానా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు రానా.. ఇప్పటికే విడుదలైన టీజర్ , పోస్టర్లు సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి విరాటపర్వంను నిర్మిస్తున్నారు.

తాజాగా రానా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం సినిమా నుంచి  రానా వాయిస్ తో ఓ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ది వాయిస్ ఆఫ్ రవన్నా అంటూ  ఇచ్చిన స్పెషల్ అప్డేట్ ఆకట్టుకుంటుంది. భ్యుదయ భావాలూ కలిగిన యువకుడిగా రానా అద్బుతంగా నటించాడు. అతడి కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది. అలాగే విరాటపర్వంలో నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ది వాయిస్ ఆఫ్ రవన్నా  వీడియో పై మీరూ ఓ లుక్కెయండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vikrant Rona: 14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న క‌న్న‌డ బాద్ షా కిచ్చ సుదీప్ సినిమా..!!

AHA Studio: మరో ముందడుగు వేసిన ఆహా.. ఇకపై ఆహా స్టూడియో ద్వారా పాన్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌లు..

Allu Arjun: ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమే నా అతి పెద్ద ఆస్తి’.. ఫ్యాన్స్‌ గాయపపడంపై స్పందించిన బన్నీ..

Follow Us